Musi River | మూసీ సుందరీకరణ.. ఎన్‌జీటీలో రేవంత్ సర్కార్‌కు ఊరట
Musi River | మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ఊరట లభించింది. గాంధీ సరోవర్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌జీటీ కొట్టేసింది.
Musi River | త్రినేత్ర.న్యూస్ : మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ఊరట లభించింది. గాంధీ సరోవర్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌జీటీ కొట్టేసింది. దీంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ వడివడిగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే మూసీ ప్రక్షాళనలో భాగంగా మంచిరేవుల వద్ద మూసీ ఒడ్డున ఓం కారేశ్వర ఆలయానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
గాంధీ సరోవర్ ప్రాజెక్టును స్థానిక నివాసితులతో పాటు ఆయా రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా బాధిత నివాసితులకు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి.. ఎన్‌జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని పేర్కొంది. కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ఎన్‌జీటీ అభిప్రాయాపడుతూ పిటిషన్‌ను కొట్టేసింది.
మూసీ, ఈసా నదుల పవిత్ర సంగమం వద్ద మహాత్మాగాంధీ పేరుతో బాపూ ఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. అత్యంత ఎత్తయిన (123 అడుగులు) గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం 60 ఎకరాల్లో బాపూ ఘాట్ ఉండగా.. 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. గాంధీ విగ్రహం కింద 100 మీటర్లతో టవర్ రానుంది. అందులో హ్యాండ్‌లూమ్ శిక్షణ కేంద్రంతో పాటు ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ హబ్, పబ్లిక్ రిక్రియేషన్ ప్రాంతం, మెడిటేషన్ అండ్ వెల్‌నెస్ విలేజ్, నేషనల్ మ్యూజియంలను ఏర్పాటు చేస్తారు. గాంధీ మ్యూజియం, ఎత్తయిన టవర్‌పై నుంచి హైదరాబాద్ మహానగరాన్ని వీక్షించేలా ఫ్లాట్‌ఫాం నిర్మాణం, సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రత్యేక వేదికలు, పరిశోధన కేంద్రాలను నిర్మించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



