Varshini Sounderajan | బిగ్‌బాస్‌లోకి యాంకర్ వర్షిణి..! మరి ఈసారైనా బీబీ హౌస్‌లో అడుగుపెడుతుందా?
Varshini Sounderajan | తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పదో సీజన్ కావడంతో ఈసారి కంటెస్టెంట్ల ఎంపికలో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉండగా.. తాజాగా యాంకర్, నటి వర్షిణి సౌందరరాజన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Entertainment | Published On Aug 23, 2026, 2.32 pm IST
Varshini Sounderajan | తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పదో సీజన్ కావడంతో ఈసారి కంటెస్టెంట్ల ఎంపికలో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉండగా.. తాజాగా యాంకర్, నటి వర్షిణి సౌందరరాజన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వర్షిణిని బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదించారని, ఆమె కూడా షోలో పాల్గొనేందుకు సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలోనూ పలు సీజన్లకు వర్షిణి పేరు వినిపించినప్పటికీ.. వివిధ కారణాలతో ఆమె హౌస్‌లోకి వెళ్లలేదు. ఈసారి మాత్రం ఆమె ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
మరోసారి తెరపైకి..
సీజన్ 4 నుంచి దాదాపు ప్రతి సీజన్ సమయంలోనూ వర్షిణి పేరు కంటెస్టెంట్‌గా తెరపైకి వచ్చింది. ఇప్పుడు పదో సీజన్ కోసం మరోసారి ఆమె పేరు ప్రచారంలోకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పెద్ద టీవీ షోలు, సినిమాలు, వెబ్ ప్రాజెక్టులు పరిమితంగా ఉండటంతో.. బిగ్‌బాస్ వంటి భారీ వేదికను ఎంచుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షిణి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ఢీ’, ‘పటాస్ 2’, ‘కామెడీ స్టార్స్’, ‘జబర్దస్త్’ వంటి కార్యక్రమాల్లో యాంకర్‌గా సందడి చేసింది. గ్లామర్‌తో పాటు ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో గుర్తింపు తెచ్చుకుంది. అందుకే బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె ఉంటే వినోదానికి కొదవ ఉండదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.యాంకరింగ్‌తో పాటు వర్షిణి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది. ‘చందమామ కథలు’తో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె.. ‘లవర్స్’, ‘నన్ను దోచుకుందువటే’, ‘జోడీ’, ‘మళ్లీ మొదలైంది’, ‘శాకుంతలం’ తదితర చిత్రాల్లో కనిపించింది. ‘పెళ్లి గోల’ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది.
వీళ్లూ వెళ్తారట..
ఇక బిగ్‌బాస్ 10 కోసం పల్లవి గౌడ, తేజస్విని గౌడ, పవన్ కళ్యాణ్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ తదితరుల పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో ఎవరు నిజంగా హౌస్‌లో అడుగుపెడతారన్నది అధికారిక ప్రకటనతోనే స్పష్టత రానుంది. వర్షిణి ఎంట్రీ నిజమైతే.. పదో సీజన్‌కు గ్లామర్‌తో పాటు అదనపు ఎంటర్‌టైన్‌మెంట్ జోడవుతుందని బిగ్‌బాస్ అభిమానులు భావిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | ఆటో కార్మికులారా! సమ్మె వద్దు.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నం
- ●Alia Bhatt | ఈ ఏడాది బాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న అలియాభట్ స్పై థ్రిల్లర్ మూవీ
- ●India Robotic Telesurgery | వైద్యరంగంలో సంచలనం: గురుగ్రామ్‌లో డాక్టర్.. హైదరాబాద్‌లో పేషెంట్.. 1,600 కి.మీ దూరం నుంచి రోబోటిక్ సర్జరీ
- ●Chamala Kirankumar Reddy | సబ్జెక్ట్ ఉండదు.. నాలెడ్జ్ అసలే ఉండదు.. నోళ్లు మాత్రం లేస్తయ్
- ●Double Standards | అమెరికా పర్యటన.. రేవంత్‌కు నో.. గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతి.. కేంద్రం వైఖరిపై ఐఓసీ ఫైర్
- ●Irumudi OTT | రవితేజ ఇరుముడి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ponnam Prabhakar | ఆటో కార్మికులారా! సమ్మె వద్దు.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నం

Alia Bhatt | ఈ ఏడాది బాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న అలియాభట్ స్పై థ్రిల్లర్ మూవీ

India Robotic Telesurgery | వైద్యరంగంలో సంచలనం: గురుగ్రామ్‌లో డాక్టర్.. హైదరాబాద్‌లో పేషెంట్.. 1,600 కి.మీ దూరం నుంచి రోబోటిక్ సర్జరీ

Chamala Kirankumar Reddy | సబ్జెక్ట్ ఉండదు.. నాలెడ్జ్ అసలే ఉండదు.. నోళ్లు మాత్రం లేస్తయ్






