త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nandini Siddha Reddy | డాక్ట‌ర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు

Nandini Siddha Reddy | ప్రఖ్యాత కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు, డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వ‌రించింది.

S

Telangana | Published On Mar 16, 2026, 3.51 pm IST

Nandini Siddha Reddy | డాక్ట‌ర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు
Advertisement

Nandini Siddha Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప్రఖ్యాత కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు, డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వ‌రించింది. వచన కవిత్వ విభాగంలో నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు ప్ర‌క‌టించింది. నందిని సిధారెడ్డి రచించిన "అనిమేష" కవితా సంపుటికి పురస్కారం ద‌క్కింది.

నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల మంజీరా రచయితల సంఘం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. సిద్దిపేట జిల్లా కొండ‌పాక మండ‌లం బందారం గ్రామానికి చెందిన సిధారెడ్డి.. తెలంగాణ సాహిత్య అకాడ‌మీ తొలి చైర్మ‌న్‌గా సేవ‌లందించారు.

 

'అనిమేష‌'లోని ఓ క‌విత‌..

మతం ఒక వైరస్
ఎప్పుడో మెదడును కమ్మేసింది
రాజకీయం మరో వైరస్
రక్త నాళాల్లో చేరిపోయింది
వ్యాపారం వావి లేని జీవి
మనస్సును మత్పరించింది
ఇవ్వాళ మనిషి ఎక్కడ దొరుకుతాడు
వొట్టి శరీరం తప్ప!

Advertisement
Advertisement