Nagoba Jatara | ఆదిశేశుడికి అభిషేకంతో.. అట్టహాసంగా ప్రారంభమైన నాగోబా జాతర
Nagoba Jatara | రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర (Nagoba Jatara) ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో (Keslapur) ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది.
త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర (Nagoba Jatara) ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో (Keslapur) ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతికి అద్దంపట్టేలా సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు.. నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజ సామగ్రితో బయలుదేరారు. డోలు, తుడుం, కాలీకోమ్, పెప్రే వాయిస్తూ పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించి లోనికి ప్రవేశించారు. నాగోబా దర్శన అనంతరం గంగాజలంతో ఆదివారం అర్ధరాత్రి ఆదిశేషుడికి అభిషేకం చేసి మహాపూజలు నిర్వహించడం ద్వారా ఈ జాతరను ప్రారంభించారు. ఈ సమయంలో మెస్రం వంశీయులు మినహా ఇతరులను అనుమతించలేదు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

23 వరకు జాతర..
నాగోబా మహాపూజతో ప్రారంభమైన జాతర.. ఈనెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ జాతరలో భాగంగా 20న పెర్సపేన్, బాన్ పేన్ పూజలు, 22న నాగోబా దర్బార్ నిర్వహించనున్నారు. 23న బేతాల్ పూజ, మండగాజాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగియనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకండా సరిహద్దు రాష్ట్రాల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు భారీగా తరలి రానున్నారు.

తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






