Manushi Chhillar | ఎంబీబీఎస్ మార్క్స్ షీట్‌ను షేర్ చేసిన మానుషి చిల్లర్..! 2016 నుంచి 2026 వరకు ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న బ్యూటీ..
Manushi Chhillar | మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెడికల్ విద్యార్థినిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. మెడికల్ విద్యార్థి నుంచి బాలీవుడ్ వరకు పదేళ్ల ప్రయాణాన్ని మరోసారి అభిమానులతో పంచుకున్నది.
Entertainment | Published On Jan 19, 2026, 11.05 am IST
Manushi Chhillar | మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెడికల్ విద్యార్థినిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. మెడికల్ విద్యార్థి నుంచి బాలీవుడ్ వరకు పదేళ్ల ప్రయాణాన్ని మరోసారి అభిమానులతో పంచుకున్నది. మిస్ యూనివర్సిస్ పోటీల్లో పాల్గొనడానికి ముందు ఆమె మెడిసిన్ చదివింది. మిస్ వరల్డ్ కిరీటం, బాలీవుడ్ సినిమాల్లోకి రాక ముందు తన జీవితం ఎలా ఉండేదో గుర్తు చేసుకున్నది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘2026 is the new 2016’ కాన్సెప్ట్‌లో భాగంగా ఆమె 2016కు సంబంధించిన పాత ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఇందులో బ్యాచిలర్ మెడిసిన్ సర్జరీ మార్క్స్ కార్డ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

మానుషి కెరీర్‌లో 2016 సంవత్సరం కీలకంగా నిలిచింది. అప్పట్లో ఆమె ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతుంది. అప్పుడే మిస్ ఇండియా పోటీలకు సిద్ధమవుతున్నది. అదే సమయంలో మోడలింగ్ చేసేందుకు అవకాశాలు వచ్చాయి. దాంతో అటు చదువును కొనసాగిస్తూనే మరో వైపు మోడలింగ్‌లో రాణిస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడిచింది. పాత ఫొటోలను గుర్తు చేసుకుంటూ 2016లో తన జీవితం ఎలా మలుపు తిరిగిందో మానుషి అభిమానులతో పంచుకుంది. అప్పట్లో చదువుతో పాటు మోడలింగ్, మిస్ ఇండియా పోటీలు.. అన్నీ ఒకేసారి సాగిన రోజులు ఇప్పటికీ ప్రత్యేకమేనని ఆమె చెప్పింది. ఎయిమ్స్‌లో చదువుతున్న సమయంలోనే మిస్ ఇండియా నిర్వాహకులు గుర్తించారన్న మానుషి.. క్లాసులు పూర్తయిన తర్వాత శనివారం రోజున తొలిసారి పోటీల కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్న రోజును ఆమె ఆసక్తిగా గుర్తు చేసుకుంది. చదువుతూనే ఓ కంపెనీ కోసం తొలి యాడ్ చేశానని.. సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో తొలిసారి క్లినికల్ పోస్టింగ్ సైతం అదే సమయంలో జరిదంటూ మెడికల్ కాలేజీలోని అనుభవాలను కూడా మనుషి సరదాగా గుర్తు చేసుకుంది. ‘నా తొలి క్లినికల్ పోస్టింగ్ జనరల్ సర్జరీలో జరిగింది. ఆ రోజు ఒకరు స్పృహ తప్పారు. మిస్ ఇండియా కోసం ‘ఒక్కసారి’ అన్న ఉద్దేశంతోనే ఇన్‌స్టాగ్రామ్‌లో చేరాను. ఇప్పుడు చూస్తే దానికి పది ఏళ్లు పూర్తయ్యాయి’ అని తెలిపింది.

2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్‌గా ఎంపికైంది. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు మళ్లీ ఆ కిరీటం తీసుకొచ్చిన మహిళగా ఆమె చరిత్రలో నిలిచింది. అంతకు ముందు 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ఈ ఘనత సాధించింది. మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత మానుషి నటన వైపు అడుగులు వేసింది. 2022లో అక్షయ్ కుమార్‌తో కలిసి ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో సంయోగిత పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘బడే మియాన్ చోటే మియాన్’ చిత్రాల్లో కనిపించింది. తెలుగులో వరుణ్ తేజ్ సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ పాత్రలో మెరిసింది. చివరగా మాలిక్, టెహ్రాన్ మూవీల్లో నటించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




