త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | నేను బీజేపీ అభ్య‌ర్థికి ఓటేశా.. బ్యాలెట్ పేప‌ర్ ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశాడు..

Municipal Elections | జీహెచ్ఎంసీ (GHMC) మిన‌హా రాష్ట్రంలోని 7 కార్పొరేష‌న్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నిక‌లు (Municipal Elections) ప్ర‌శాంతంగా ముగిశాయి. ఓట‌రు చైత‌న్యం వెల్లివిరియ‌డంతో 73.01 శాతం పోలింగ్ న‌మోదైంది.

G

Telangana | Published On Feb 12, 2026, 7.05 am IST

Municipal Elections | నేను బీజేపీ అభ్య‌ర్థికి ఓటేశా.. బ్యాలెట్ పేప‌ర్ ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశాడు..
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: జీహెచ్ఎంసీ (GHMC) మిన‌హా రాష్ట్రంలోని 7 కార్పొరేష‌న్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నిక‌లు (Municipal Elections) ప్ర‌శాంతంగా ముగిశాయి. ఓట‌రు చైత‌న్యం వెల్లివిరియ‌డంతో 73.01 శాతం పోలింగ్ న‌మోదైంది. యాదాద్రి జిల్లా చౌటుప్ప‌ల్ అత్య‌ధికంగా 91.91 శాతం పోలింగ్ రికార్డ‌యింది. పురుషుల కంటే మ‌హిళ‌లే ఎక్కువ‌గా ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం విశేషం. కాగా, హుజూరాబాద్‌లో (Huzurabad Municipality) ఓ ఓట‌ర్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పోలింగ్ బూత్‌లోకి ఫోన్ తీసుకుపోవ‌డ‌మే కాకుండా, తాను ప‌లానా అభ్య‌ర్థికి ఓటేశాన‌ని చెప్ప‌డానికి బ్యాలెట్ పేప‌ర్‌ను ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. అదికాస్తా వైర‌ల్ కావ‌డంతో, ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం సృష్టించింది.

హుజూరాబాద్‌ పట్టణంలోని రెండో వార్డు నుంచి బీజేపీ త‌ర‌ఫున దున్నపోతుల ఎల్లమ్మ పోటీ చేశారు. బ్యాలెట్ పేప‌ర్‌లో ఆమె గుర్తు వ‌రుస క్ర‌మం రెండులో ఉన్న‌ది. నాలుగో పోలింగ్ బూత్‌లో పువ్వు గుర్తుపై ఓటు వేసిన ఓ వ్య‌క్తి, దానిని త‌న ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు. అనంతరం సోష‌ల్ మీడియాలో స్టేటస్‌ పెట్టుకున్నాడు. దానిని చూసి కొందరు బీజేపీ నాయకులు కూడా రీపోస్టు చేశారు. దీంతో విష‌యం కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది.

సెల్‌ఫోన్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లరాదనే నిబంధన ఉన్నప్పటికీ బ్యాలెట్ పేప‌ర్‌ బయటికి ఎలా వచ్చిందని పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలింగ్‌ బూత్‌ అధికారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement