MLC Dasoju | అంబేద్కర్ రాజ్యాంగమా? ‘అనుముల’ రాజ్యాంగమా?
MLC Dasoju | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రశ్నించే హక్కుపై దాడులు జరగడం ఏమిటని నిలదీశారు. ‘అంబేద్క్‌ర్ రాజ్యాంగమా? లేక అనుముల రాజ్యాంగమా?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా స్పందించారు.
- రాహుల్‌గాంధీని ప్రశ్నించిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
- రాజ్యాంగ దినోత్సవం రోజే ప్రశ్నించే గొంతులపై దాడులా?
- రేవంత్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు
MLC Dasoju | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రశ్నించే హక్కుపై దాడులు జరగడం ఏమిటని నిలదీశారు. ‘అంబేద్క్‌ర్ రాజ్యాంగమా? లేక అనుముల రాజ్యాంగమా?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను గమనించాలని దాసోజు శ్రవణ్ కోరారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగడం రాహుల్‌గాంధీ సిద్ధాంతాలకే విరుద్ధమని పేర్కొన్నారు.
బావర్చి ఘటనను ఖండించిన ఎమ్మెల్సీ..
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో నిరుద్యోగుల పక్షాన కార్యక్రమం నిర్వహించిన బీఆర్‌ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, జగన్, ముఠా జైసింహ, హరీష్‌రెడ్డి, దినేశ్ చౌదరి, పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని నిలదీశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్క్‌ర్ ఫొటో లేకపోవడాన్ని కూడా దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. ఒకవైపు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతూనే మరోవైపు అంబేద్క్‌ర్ చిత్రాన్ని విస్మరించడం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని కాపాడతామని చెబుతుంటే.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై రాహుల్‌గాంధీ స్పందించాలని కోరారు.
అంబేద్కర్ రాజ్యాంగమా? లేక ‘అనుముల’ రాజ్యాంగమా? రాహుల్ గాంధీ గారూ మేలుకోండి!
@RahulGandhiభారత రాజ్యాంగ దినోత్సవం నాడే, రాజ్యాంగం కల్పించిన 'ప్రశ్నించే హక్కు'పై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేయడం విడ్డూరం.
ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేతిలో రాజ్యాంగం పట్టుకుని ‘సంవిధాన్ బచావో’ అంటూ నినదిస్తుంటే, మరోవైపు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు తెగబడటం రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలకే తూట్లు పొడవడం కాదా?
@revanth_anumulaనిరుద్యోగుల పక్షాన నిలబడిన జగన్, కృష్ణక్, ముఠా జైసింహ, హరీష్ రెడ్డి, దినేష్ చౌదరి, పుట్ట విష్ణు వర్ధన్ రెడ్డిలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఇక అన్నింటికంటే విచిత్రం ఏమిటంటే... రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన దినపత్రికల ప్రకటనల్లో సాక్షాత్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి బొమ్మే మాయమైంది!
దీన్ని బట్టి చూస్తుంటే, తెలంగాణలో నడుస్తున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు... కేవలం ‘అనుముల రాజ్యాంగం’ అని స్పష్టమవుతోంది.
రాహుల్ గాంధీ గారూ... ఢిల్లీలో మీరు రాజ్యాంగాన్ని కాపాడతామంటే, గల్లీలో మీ ముఖ్యమంత్రి దాన్ని పాతర వేస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోండి!
@Kcr @KTRBRS @BRSHarish
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) November 26, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | బీఆర్‌ఎస్ నేతలపై దాడిని ఖండిస్తున్నాం
- ●One Way | సైబరాబాద్‌లో వన్‌వే రోడ్లు.. స్పెషల్‌గా బస్ లేన్లు!
- ●Constitution Day | రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి.. పరిరక్షించండి..
- ●KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
- ●Manne Krishank | బావర్చి హోటల్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ
- ●Moosapet | మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి లైన్ క్లియర్.. హైకోర్టు స్టే లేదన్న అధికారులు..!







