Harish Rao | బీఆర్‌ఎస్ నేతలపై దాడిని ఖండిస్తున్నాం
Harish Rao | చిక్కడపల్లిలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హక్కులను గూండాయిజంతో కాలరాయడం, అందులోనూ రాజ్యాంగ దినోత్సవం రోజే ఇలాంటి ఘటనకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు
- బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి: హరీశ్‌రావు
- రాజ్యాంగ దినోత్సవం రోజే ప్రజాస్వామ్య హక్కులపై దాడులా?
- డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
Harish Rao | చిక్కడపల్లిలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హక్కులను గూండాయిజంతో కాలరాయడం, అందులోనూ రాజ్యాంగ దినోత్సవం రోజే ఇలాంటి ఘటనకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. చిక్కడపల్లిలో జరిగిన దాడిలో బీఆర్‌ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, జగన్, ముఠా జైసింహ, హరీష్‌రెడ్డి, దినేశ్ చౌదరి, పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు పార్టీ కార్యకర్తలు లక్ష్యంగా మారారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం ద్వారా ప్రజల గొంతును నొక్కలేరని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ డీజీపీని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Strongly condemn the cowardly attack by Congress goons on BRS leaders @Krishank_BRS @JAGANBRS @dcstunner999 @PuttaVishnuVR @MutaJaisimha @HarishReddyRDM and our activists at Chikkadpally.
Trampling democratic rights with goondaism, and that too on #ConstitutionDay, is shameful. It will never be tolerated in a democracy.
We demand @TelanganaDGP immediately arrest those responsible and initiate stringent legal action against them.
— Harish Rao Thanneeru (@BRSHarish) November 26, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MLC Dasoju | అంబేద్కర్ రాజ్యాంగమా? ‘అనుముల’ రాజ్యాంగమా?
- ●One Way | సైబరాబాద్‌లో వన్‌వే రోడ్లు.. స్పెషల్‌గా బస్ లేన్లు!
- ●Constitution Day | రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి.. పరిరక్షించండి..
- ●KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
- ●Manne Krishank | బావర్చి హోటల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ
- ●Moosapet | మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి లైన్ క్లియర్.. హైకోర్టు స్టే లేదన్న అధికారులు..!

MLC Dasoju | అంబేద్కర్ రాజ్యాంగమా? ‘అనుముల’ రాజ్యాంగమా?

One Way | సైబరాబాద్‌లో వన్‌వే రోడ్లు.. స్పెషల్‌గా బస్ లేన్లు!

Constitution Day | రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి.. పరిరక్షించండి..

KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?



