MLA Sudheer Reddy | మూసీ ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారం
MLA Sudheer Reddy | మూసీ ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ.. ప్రభుత్వమే పొంతన లేకుండా మాట్లాడుతోంది అని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు. దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నాం అని ధ్వజమెత్తారు.
దోపిడీని మేం వ్యతిరేకిస్తున్నాం
50 మీటర్ల బఫర్ జోన్‌ను 500 మీటర్లకు ఎలా పెంచారు..?
డీపీఆర్ లేకుండా ఎలా టెండర్లు పిలుస్తారు..?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
MLA Sudheer Reddy | త్రినేత్ర న్యూస్ : మూసీ ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ.. ప్రభుత్వమే పొంతన లేకుండా మాట్లాడుతోంది అని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు. దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నాం అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మూసీ ప్రాజెక్టుపై పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి ప్రజల మాట వినకుండా నిరంకుశంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిందని నిప్పులు చెరిగారు. ఎవరికీ నష్టం జరగకుండా కేసీఆర్ ముందు చూపుతో నాడే మూసీ పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టారు. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
50 మీటర్ల బఫర్ జోన్ ను 500 మీటర్లకు ఎలా పెంచారు? డీపీఆర్ లేకుండా ఎలా టెండర్లు పిలుస్తారు? కమిషన్లు తీసుకొని బీఆర్ఎస్‌ను బద్నాం చేయవచ్చన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం డీపీఆర్ బయటపెట్టి... ప్రజలకు అన్ని వివరించాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది... ఎవరి గూడు చెదరనివ్వబోము. అధికారం ఉందని బలవంతంగా చేస్తామని అంటే ఊరుకునేది లేదు. ప్రజల తరపున మాట్లాడేందుకు వెళ్లిన మమ్మల్ని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అరాచకం చేయడం మానుకోవాలి. కేసీఆర్ కట్టిన మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెస్తామని అంటారు... కానీ, కన్నేపల్లి నుంచి మాత్రం నీటిని ఎత్తిపోయరు. రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... ఏమైనా కానీ నీళ్లు ఎత్తేది లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

Koyyala Ruth John Paul | ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసిన మొదటి ట్రాన్స్ మహిళ
అక్టోబర్ 28, 2026

KTR | బీఆర్ఎస్ గొంతు నొక్కే కుట్రలను సహించే ప్రసక్తే లేదు : కేటీఆర్
అక్టోబర్ 28, 2026

Ponguleti Srinivas Reddy | త్వరలో మరో 15 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి పొంగులేటి ప్రకటన
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●Union Cabinet Decisions | కేంద్ర కేబినెట్ బంపర్ బొనాంజా: 3% డీఏ పెంపు, రూ.25,000కు పీఎఫ్ సీలింగ్.. తయారీ రంగానికి వేల కోట్ల నిధులు!
- ●Koyyala Ruth John Paul | ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసిన మొదటి ట్రాన్స్ మహిళ
- ●Reliance Industries | రూ.10 కోట్ల నుంచి రూ.12.5 లక్షల కోట్లకు.. అంబానీల అద్భుత ప్రస్థానం..
- ●T20 Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ జోరు.. టెస్టుల్లో యాన్సెన్ చరిత్ర
- ●High Speed Trains Collide | రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. 46 మంది మృతి
- ●BELలో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా

Union Cabinet Decisions | కేంద్ర కేబినెట్ బంపర్ బొనాంజా: 3% డీఏ పెంపు, రూ.25,000కు పీఎఫ్ సీలింగ్.. తయారీ రంగానికి వేల కోట్ల నిధులు!

Koyyala Ruth John Paul | ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసిన మొదటి ట్రాన్స్ మహిళ

Reliance Industries | రూ.10 కోట్ల నుంచి రూ.12.5 లక్షల కోట్లకు.. అంబానీల అద్భుత ప్రస్థానం..

T20 Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ జోరు.. టెస్టుల్లో యాన్సెన్ చరిత్ర



