త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sanjay | మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే సంజయ్.. ఈత వ‌నానికి వెళ్లి త‌క్ష‌ణ‌ ఆర్థిక సాయం అంద‌జేత‌

MLA Sanjay | జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్‌లో అగ్నిప్రమాదంలో ఈత వనం దగ్ధమై ఉపాధి కోల్పోయిన గౌడన్నలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. ప్రభుత్వం వెనువెంట‌నే వారిని ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On May 29, 2026, 12.49 pm IST

MLA Sanjay | మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే సంజయ్.. ఈత వ‌నానికి వెళ్లి త‌క్ష‌ణ‌ ఆర్థిక సాయం అంద‌జేత‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్‌లో అగ్నిప్రమాదంలో ఈత వనం దగ్ధమై ఉపాధి కోల్పోయిన గౌడన్నలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. తన వంతుగా బాధితులకు రూ.20 వేల తక్షణ ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం వెనువెంట‌నే వారిని ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.

అంత‌కు ముందు నాయ‌కుల‌తో క‌లిసి ద్విచ‌క్ర‌వాహ‌నాల‌పై ప్ర‌మాద స్థ‌లికి చేరుకున్నారు. ఈత‌వ‌న‌మంతా క‌లియ‌తిరిగారు. బాధితుల నుంచి ప్ర‌మాద వివ‌రాల‌ను అడిగి తెలుసుకొని వారికి భ‌రోసా క‌ల్పించారు. బాధిత గౌడ‌న్న‌లు త‌మ గోడును ఎమ్మెల్యేకు వివ‌రించారు. తాము ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటామ‌ని ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వారికి భ‌రోసా ఇచ్చారు.

70 కుటుంబాలు జీవ‌నాధారం కోల్పోయాయి..

అనంత‌రం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు. చిన్న‌ పిల్ల‌ల్లా పెంచుకున్న చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్ర‌మాదంతో 70 కుటుంబాలు జీవ‌నాధారం కోల్పోయాయి. వెనువెంట‌నే బాధిత కుటుంబాల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి. కేసీఆర్ ఉన్న‌ప్పుడు ప‌న్నులు తీసేసి, పెన్ష‌న్లు అందించి గౌడ‌న్న‌ల‌ను అన్ని విధాలుగా ఆదుకున్నాం. ఈత వ‌నాల మీదే వారి జీవ‌నం ఆధార‌ప‌డి ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల 11 గ్రామాల్లో ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఆ న‌ష్టాన్ని గుర్తించి బాధితుల‌ను ఆదుకోవాలి. వారికి వేరే ఆధారం లేదు. కుల‌వృత్తులు బ‌త‌కాలి అని ఎమ్మెల్యే సంజ‌య్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement