త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case | మైనర్ బాలిక కేసు.. డ్యామేజ్ కంట్రోల్‌లో కాంగ్రెస్?

P

Telangana | Published On May 15, 2026, 9.12 pm IST

POCSO Case | మైనర్ బాలిక కేసు.. డ్యామేజ్ కంట్రోల్‌లో కాంగ్రెస్?
Advertisement

POCSO Case | బండి భ‌గీర‌థ్‌కు సంబంధించిన పోక్సో కేసు ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ న‌డుస్తోంది. ఈ ఘటనతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందన్న భావన హైకమాండ్‌లో వ్యక్తమైనట్లు సమాచారం. రాష్ట్రం నుంచి వరుసగా వెళ్లిన నివేదికల త‌ర్వాత పార్టీ అధిష్ఠానం స్పందించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో హడావుడిగా నష్టనివారణ చర్యలు ప్రారంభించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి తనకు మెసేజ్ వచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ప్రభుత్వం, పార్టీ పరంగా వేగంగా చర్యలు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.

కేంద్ర‌మంత్రికి సీఎం సూచ‌న‌..

ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి వే టూ న్యూస్ కాంక్లేవ్‌లో కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ వెంట‌నే త‌న కొడుకును పోలీసుల‌కు అప్ప‌గించాల‌ని బహిరంగంగా సూచించారు. ఇప్పటికే డ్యామేజ్ జ‌రిగింద‌ని.. ఇంకా న‌ష్టం జ‌రుగ‌కుండా చూసుకోవాల‌ని “ప్రియమిత్రుడు” బండి సంజయ్‌కు సూచనలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు, కేసులో బాధితురాలి తరఫున కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అవుతుందంటూ పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఈ వ్యవహారంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతున్నాయంటూ పార్టీ అనుకూల వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ ఘటన రాజకీయంగా మరింత వేడెక్కుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

రెండోసారి విచారణకు గైర్హాజరు

బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు కొన‌సాగుతోంది. విచారణకు హాజరుకావాలంటూ పేట్ బ‌షీరాబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేసినా హాజ‌రుకాలేదు. ఈ నెల 13న బీఎన్ఎస్‌
పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విష‌యం తెలిసిందే. విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత కారణాలు, కొన్ని పత్రాలు సేకరించాల్సి ఉందంటూ అదనపు గడువు కోరుతూ భ‌గీర‌థ్ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. గడువు కోరిన తర్వాత కూడా శుక్రవారం ఆయన విచారణకు హాజరుకాలేదు. మే 8న ఓ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. తన కుమార్తెపై భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. అనంతరం బాధితురాలి స్టేట్‌మెంట్ నమోదు చేసిన తర్వాత పోలీసులు ప‌లు సెక్ష‌న్లు జోడించారు. ఈ కేసు దర్యాప్తును ఉన్నతాధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement