Vakiti Srihari | తెలంగాణను అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం
Vakiti Srihari | తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర కీడ్రా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను దేశంలోనే అత్యుత్తమంగా నిర్వహించి తెలంగాణ సత్తా చాటుదాం అని పిలుపునిచ్చారు.
ఖేలో ఇండియా నిర్వహణకు రూ. 203.36 కోట్లు
రాబోయే 20 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా క్రీడా సదుపాయాలు
క్రీడా రంగానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం
డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో క్రీడా పండుగ వాతావరణం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యలు
Vakiti Srihari | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర కీడ్రా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను దేశంలోనే అత్యుత్తమంగా నిర్వహించి తెలంగాణ సత్తా చాటుదాం అని పిలుపునిచ్చారు.
మంగళవారం సచివాలయంలో ఇన్వెస్ట్ తెలంగాణ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అంశాలపై ప్రముఖ క్రీడా ప్రముఖులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండీ సోనిబాలాదేవి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఖేలో ఇండియా నిర్వహణకు రూ.203.36 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ ద్వారా క్రీడా రంగానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం అని ఉద్ఘాటించారు. ఖేలో ఇండియా నిర్వహణ కేవలం ఒక క్రీడా కార్యక్రమానికి పరిమితం కాకూడదని, భవిష్యత్తులో ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులను తయారు చేసే దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని మంత్రి తెలిపారు.
తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు ప్రధాన వేదికగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఖేలో ఇండియా నిర్వహణలో ప్రముఖ క్రీడాకారులు, మాజీ అంతర్జాతీయ క్రీడాకారుల భాగస్వామ్యం తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రతి క్రీడా వేదికను దత్తత తీసుకుని పర్యవేక్షించేలా ప్రముఖ క్రీడాకారులకు బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నామన్నారు.
డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో క్రీడా పండుగ వాతావరణం నెలకొనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే వేలాది మంది క్రీడాకారులకు అత్యుత్తమ ఆతిథ్యం, వసతులు కల్పిస్తామన్నారు. గ్రామీణ, గురుకుల విద్యార్థులను క్రీడా పోటీలకు తీసుకొచ్చి వారిలో క్రీడా స్ఫూర్తి నింపుతామన్నారు. ఖేలో ఇండియా విజయంతో భవిష్యత్తులో క్రీడా రంగానికి రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు నిధులు సాధించే దిశగా కృషి చేస్తామని చెప్పారు. క్రీడా వేదికల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం.. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రీడాకారుల సూచనలను స్వీకరించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ప్రముఖ క్రీడాకారులు జె.జె. శోభ, నీతా ఎల్. దాడ్వే, ఇస్మాయిల్ బేగ్, ఈషా సింగ్, అంబటి తిరుపతి రాయుడు, అగసర నందిని, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా, కల్నల్ నచ్ఛతర్ సింగ్ జోహల్, బోరియా మజుందార్, నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
నవంబర్ 21, 2026

Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు



