Rythu Bharosa | రాష్ట్ర రైతాంగానికి శుభవార్త.. 30న రైతు భరోసా నిధులు విడుదల
Rythu Bharosa | రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ నెల 30న రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Rythu Bharosa | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ నెల 30న రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇవాళ జరిగిన మంత్రుల సమావేశంలో పలు అంశాలపై చర్చించాం. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొదటగా వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 30న ఖమ్మం జిల్లాలోని మధిరలో రైతు సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని నిర్ణయించాం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తారు. రైతులు పండించే 7 రకాల సన్నాలకు బోనస్ ఇవ్వాలని మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ఆ వెరైటీలకు ఉన్న డిమాండ్, ప్రజల అవసరాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
ఏడు రకాల సన్నాలు ఇవే..
డీపీటీ 5204
ఆర్ఎన్నార్ 15048
హెచ్ఎంటీ సోనా
జైశ్రీరాం
కేఎన్ఎం 1638
డబ్ల్యూజీఎల్ 44
కేఎన్ఎం 7715
పైన పేర్కొన్న ఏడు రకాల సన్నాలకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలని నిర్ణయించాం..
రాష్ట్రంలోని రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం పండించారు. యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దేశంలోనే 29 రాష్ట్రాల్లో యాసంగి పంటలో ఈ స్థాయిలో సేకరణ జరగలేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే కేంద్రం మన రాష్ట్రం నుంచి తక్కువ శాతం ధాన్యం సేకరించడంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఏయే పంట ఉత్పత్తులకు ఎంఎస్సీ(కనీస మద్దతు ధర) నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలని నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు.
ఎరువుల కోటాను విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం..
వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అనేకసార్లు లేఖలు రాశారు. ఆ కోటాను కేంద్రం వెంటనే విడుదల చేయాలని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా మనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. మధ్యప్రదేశ్, బీహార్‌కు పంపించంకుండా మనకు కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గిపోతాయి. ఎరువుల సమస్య ఉత్పన్నం కాదు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మన రైతుల తరపున ఒత్తిడి పెంచాలనిని నిర్ణయించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!
- ●Stamps and Registration services | రిజిస్ట్రేషన్ సేవలకు సెలవ్.. ఏయే తేదీల్లో అంటే
- ●CM Revanth Reddy | ఫ్యూచర్ లేనోడళ్ల ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాడట.. హరీశ్‌రావుపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్
- ●Telangana | రైతులకు పిడుగులాంటి వార్త.. పాత పద్ధతిలో పంట కొనుగోళ్లకు ఇక నుంచి స్వస్తి

OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!

Stamps and Registration services | రిజిస్ట్రేషన్ సేవలకు సెలవ్.. ఏయే తేదీల్లో అంటే



