Minister Tummala | రైతుల అభిప్రాయాలతోనే సమర్థవంతంగా యాంత్రీకరణ పథకం : మంత్రి తుమ్మల
Minister Tummala | రైతుల అభిప్రాయాలతో యాంత్రీకరణ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునఃప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర, కేంద్ర వాటాలతో అమలు చేయనున్న ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
Minister Tummala | రైతుల అభిప్రాయాలతో యాంత్రీకరణ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునఃప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర, కేంద్ర వాటాలతో అమలు చేయనున్న ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మార్గదర్శకాలు అందిన వెంటనే ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2025–26లో పథకానికి రూ.71 కోట్లు కేటాయించగా.. రూ.63 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. 2026–27లో రూ.147.99 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా పథకాన్ని అమలు చేయాలని సూచించారు.
నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు
రైతులు తమకు నచ్చిన ఎంప్యానెల్ కంపెనీ నుంచి వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని తుమ్మల సూచించారు. పరికరం కొనుగోలుకు ముందు వివిధ కంపెనీల ధరలు, నాణ్యతను పరిశీలించుకునే అవకాశం రైతులకు ఉండాలన్నారు. సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం, బీసీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ అందుతుందని చెప్పారు. పథకం పరిధిలో ప్రస్తుతం 37 రకాల వ్యవసాయ పరికరాలను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో 19 రకాల పరికరాలు మాత్రమే ఉండగా.. రైతుల అవసరాలకు అనుగుణంగా వాటి సంఖ్యను పెంచినట్లు చెప్పారు. పవర్ టిల్లర్, పవర్ వీడర్, రోటావేటర్, సీడ్-కం-ఫెర్టిలైజర్ డ్రిల్, మల్టీక్రాప్ ప్లాంటర్, స్ప్రేయర్లు, కిసాన్ డ్రోన్, కంబైన్ హార్వెస్టర్, థ్రెషర్, పసుపు బాయిలర్, పాలిషర్, మొబైల్ డ్రైయర్, స్ట్రా బేలర్, మల్చర్ తదితర పరికరాలు ఇందులో ఉన్నాయి. కొత్త సాంకేతికత, సాగు విధానాల మార్పులకు అనుగుణంగా మరిన్ని పరికరాలను చేర్చేలా విధానం ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఎఫ్‌పీఓలతో కస్టమ్ హైరింగ్ సెంటర్లు
యాంత్రీకరణలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌పీఓ)ను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి పరికరాలను రైతులకు అద్దెకు అందించే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఖరీదైన యంత్రాలను ఒక్కో రైతు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రైతులకు యాంత్రీకరణ ప్రయోజనాలు అందేలా చూడాలని చెప్పారు. పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రైతులు, ఎఫ్‌పీఓల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని తుమ్మల సూచించారు. వచ్చే మంగళవారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో యాంత్రీకరణ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని రైతులకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా పథకానికి తుది రూపం ఇవ్వాలని సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!



