త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seethakka | రాహుల్ గాంధీని తిడితే పెద్ద లీడ‌ర్ అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారు.. మంత్రి సీత‌క్క‌

Seethakka | త‌న‌ను ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని రాహుల్ గాంధీని (Rahul Gandhi) నిందించ‌డాన్ని కేటీఆర్ (KTR) అల‌వాటు చేసుకున్నార‌ని మంత్రి సీత‌క్క (Seethakka) విమ‌ర్శించారు. రాహుల్‌ని తిడితే పెద్ద లీడ‌ర్ అవుతాన‌ని కేటీఆర్ అనుకుంటున్నాడని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Mar 16, 2026, 1.14 pm IST

Seethakka | రాహుల్ గాంధీని తిడితే పెద్ద లీడ‌ర్ అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారు.. మంత్రి సీత‌క్క‌
Advertisement

Seethakka | త్రినేత్ర‌.న్యూస్‌: త‌న‌ను ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని రాహుల్ గాంధీని (Rahul Gandhi) నిందించ‌డాన్ని కేటీఆర్ (KTR) అల‌వాటు చేసుకున్నార‌ని మంత్రి సీత‌క్క (Seethakka) విమ‌ర్శించారు. రాహుల్‌ని తిడితే పెద్ద లీడ‌ర్ అవుతాన‌ని కేటీఆర్ అనుకుంటున్నాడని మండిప‌డ్డారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు పెడితేనే ఓర్వ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్‌‌లో మంత్రి మాట్లాడుతూ.. కేటీఆర్‌ను ఎవరూ గుర్తిస్తలేరనే భయంతోనే తమ అధినేత రాహుల్ గాంధీని నిందించడం అలవాటుగా మార్చుకున్నాడన్నారు. తాను గ్రేట్ లీడర్ అవుతానని పగటి కలలు కంటున్నాడని సెటైర్లు వేశారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. పథకాల చట్టబద్ధత గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇతరులను అనే ముందు బీఆర్ఎస్ నాయకుల డ్రగ్స్ దందాపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఆ పార్టీ నేతపై చర్యలు తీసుకోకపోవడమే వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వారి వారసత్వాన్ని ఆ పార్టీ నేత‌లు ఫామ్‌హౌస్‌లలో కొనసాగిస్తున్నారు మండిప‌డ్డారు. కేంద్రం వైఫ‌ల్యాల గురించి మాట్లాడాలంటేనే కేటీఆర్‌కు వ‌ణుకు పుడుతున్న‌ద‌ని విమ‌ర్శించారు.

Advertisement
Advertisement