Minister Seethakka | లక్ష్యం సాధిస్తే సీఎం చేతుల మీదుగా సన్మానం: మంత్రి సీతక్క
Minister Seethakka | రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15లోపు లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని అత్యుత్తమంగా సాధించిన అధికారులు, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానిస్తామని తెలిపారు.
Minister Seethakka | రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15లోపు లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని అత్యుత్తమంగా సాధించిన అధికారులు, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానిస్తామని తెలిపారు. సచివాలయం నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వీబీ జీ రాంజీ, తెలంగాణ జలసిరి, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GP SAP) అమలుపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు ఫార్మ్ పాండ్, ప్రతి గ్రామానికి ఊట కుంట, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టాలని చెప్పారు. ఆగస్టు 7 నుంచి జిల్లాల వారీగా స్వయంగా సమీక్షలు నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. గ్రామసభలను క్రమం తప్పకుండా నిర్వహించి, గ్రామాల అవసరాలకు అనుగుణంగా వీబీ జీ రాంజీ పరిధిలోని పనులను గుర్తించి ప్రారంభించాలని ఆదేశించారు. మండల స్థాయిలో పనుల పర్యవేక్షణకు మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీడీఓ, ఏపీఓ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ పనుల పురోగతిని సమీక్షిస్తూ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల అవసరాలు, వనరులు, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని GP SAP ప్రణాళికలను శాస్త్రీయంగా రూపొందించాలని మంత్రి సూచించారు. గ్రామీణ ఉపాధి, జల సంరక్షణ, సమగ్ర గ్రామాభివృద్ధి లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!
- ●Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే
- ●CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ
- ●Prabhas | ప్రభాస్ సినిమా చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు - డైలాగ్ రైటర్ కామెంట్స్
- ●Mahesh Kumar Goud | మోదీ తలవంచక తప్పలేదు
- ●Nitin Nabin BJP | ధర్మేంద్ర ప్రధాన్ నిజాయతీకి నిదర్శనం : నితిన్ నబిన్

KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే

CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ

Prabhas | ప్రభాస్ సినిమా చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు - డైలాగ్ రైటర్ కామెంట్స్





