త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | రాహుల్ గాంధీ గారు.. మా పొట్ట కొట్టకండి! వ్యాపారుల లేఖ

Rahul Gandhi | నవంబరు 1న రామ్ లీలా మైదానం( Ram Leela Grounds ) లో ఇండియా కూటమి( INDIA Bloc ) నిర్వహించ తలపెట్టిన భారీ నిరసనను కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కి ఢిల్లీ వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. నిరసనలను పదిరోజులు వాయిదా వేసుకుంటే తమ వ్యాపారానికి ఢోకా ఉండదంటూ.. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) శనివారం రాహుల్ గాంధీకి లేఖ రాసింది.

S

National | Published On Oct 24, 2026, 12.41 pm IST

Rahul Gandhi | రాహుల్ గాంధీ గారు.. మా పొట్ట కొట్టకండి! వ్యాపారుల లేఖ
Advertisement

అక్టోబర్ నెలలో ఆందోళనలతో 3వేల కోట్ల నష్టం
ధన త్రయోదశి నాడు 25వేల కోట్ల బిజినెస్
మీరు నిరసన చేస్తే మాకు భారీ నష్టాలు
ప్రతిపక్ష నాయకుడికి చాంబర్ ఆఫ్ ట్రేడ్ ఆండ్ ఇండస్ట్రీ లేఖ

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : నవంబరు 1న రామ్ లీలా మైదానం( Ram Leela Grounds ) లో ఇండియా కూటమి( INDIA Bloc ) నిర్వహించ తలపెట్టిన భారీ నిరసనను కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కి ఢిల్లీ వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. నిరసనలను పదిరోజులు వాయిదా వేసుకుంటే తమ వ్యాపారానికి ఢోకా ఉండదంటూ.. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) శనివారం రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ఈ ఏడాది నవంబర్ 10న వచ్చే భాయ్ దూజ్ తర్వాత తేదీకి ర్యాలీని మార్చాలని CTI ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ తన లేఖలో అభ్యర్థించారు.

ఆ 20 మార్కెట్లకు తీవ్ర నష్టం

ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ..రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. "రామ్‌లీలా మైదాన్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో 20 ప్రముఖ హోల్‌సేల్ మరియు రిటైల్ మార్కెట్లు ఉన్నాయి.వీటిలో చాందినీ చౌక్, సదర్ బజార్, ఖారీ బౌలీ, భగీరథ్ ప్యాలెస్, దరిబా కలాన్, కాశ్మీర్ గేట్, నై సరాక్, మోరీ గేట్, తిలక్ బజార్, దర్యాగంజ్, జామా మసీదు, చావ్రి బజార్, కరోల్ బాగ్, నబీ కరీం, ఆజాద్ మార్కెట్ మరియు లజపత్ రాయ్ మార్కెట్ ఉన్నాయి.ధన త్రయోదశి (ధంతేరస్), భాయ్ దూజ్, దీపావళి పండుగలు ఢిల్లీ వ్యాపారులకు అత్యంత ముఖ్యమైనవి. ధంతేరస్ నవంబర్ 6న, దీపావళి నవంబర్ 8న మరియు భాయ్ దూజ్ నవంబర్ 10న వస్తాయి. ఒక్క ధంతేరస్ రోజే ఢిల్లీలో సుమారు రూ. 25,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది" అని ఆ లేఖలో సీటీఐ పేర్కొన్నది.

దసరాకు బాగా నష్టపోయాం

"అక్టోబర్ నెలలో జరిగిన ఆందోళన వల్ల బాగా నష్టపోయాం. కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్, సెంట్రల్ ఢిల్లీ పరిసరాల్లో రోడ్ల మూసివేశారు. దారులు మళ్లించారు. దీంతో అక్టోబర్ నెలలో 3వేల కోట్ల పైచిలుకు ఆదాయాన్ని నష్టపోయాం. రామ్‌లీలా మైదాన్‌కు పాత ఢిల్లీ రైల్వే స్టేషన్, కొత్త ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నాయి. ర్యాలీ సమయంలో ఆంక్షలు, రద్దీ కారణంగా పండుగ షాపింగ్ కోసం నగరానికి వచ్చే ప్రయాణికులకు, సందర్శకులకు ఇబ్బందులు కలగొచ్చు. మీ ర్యాలీలు, మీ సభలను ఆహ్వానిస్తున్నాం. కానీ అదే సమయంలో ఢిల్లీ వ్యాపారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోగలరు. దీపావళి ముగిసిన తర్వాత..నవంబర్ 10 అనంతరం ర్యాలీ నిర్వహించే విషయాన్ని పరిశీలించగలరు" అంటూ రాహుల్ గాంధీకి సీటీఐ విజ్ఞప్తి చేసింది

Advertisement
Advertisement