త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponnam Prabhakar | రైతులు పంటల మార్పిడిలో ఆదర్శంగా నిలవాలి : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Minister Ponnam Prabhakar | రైతులు పంట‌ల మార్పిడిలో ఆద‌ర్శంగా నిల‌వాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో ముఖ్య‌మంత్రితో క‌లిసి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీ శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు.

P

Telangana | Published On Mar 22, 2026, 5.15 pm IST

Minister Ponnam Prabhakar | రైతులు పంటల మార్పిడిలో ఆదర్శంగా నిలవాలి : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Minister Ponnam Prabhakar | రైతులు పంట‌ల మార్పిడిలో ఆద‌ర్శంగా నిల‌వాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో ముఖ్య‌మంత్రితో క‌లిసి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీ శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. గుజరాత్ పాల ఉత్పత్తిలో కురియన్ మాదిరి తెలంగాణలో ఆయిల్ ఉత్పత్తిలో తెలంగాణ రైతాంగం ఆయిల్ ఫామ్ కురియన్‌గా తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు పేరును చెప్పుకుంటార‌న్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అశ్వరావుపేట తీసుకువెళ్లి ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన క‌ల్పించారు. ఆయిల్ ఫామ్ సాగుకు ఎలాంటి ప్రకృతి ఇబ్బంది ఉండద‌ని, వాతావరణ ఇబ్బందులు ఉండ‌వ‌న్నారు.

ఏ భూమిలో అయినా ఫామ్ ఆయిల్ సాగు చేయవచ్చ‌ని, ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకు ఆయిల్ ఫెడ్ ప్రతి మండల కేంద్రంలో గెలల కనెక్షన్ కొనుగోలు కేంద్రాలు పెట్ట‌బోతుంద‌న్నారు. ప‌దెక‌రాలు ఉన్న రైతులు ఎనిమిది ఎక‌రాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాల‌ని ఆయ‌న కోరారు. ఆయిల్ ఫామ్ సాగు చేసిన వారికి 3 సంవత్సరాలు పంట నష్టం జరగకుండా అంత‌ర పంట‌లు వేసుకోవ‌చ్చ‌న్నారు. ఈ ప్రాంత రైతాంగం అంత ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉపయోగించుకోవాల‌ని, ఆయిల్ ఫామ్ సాగు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. గంటకు 30 టన్నుల నుంచి 120 టన్నుల వరకు ఇక్కడ క్రషింగ్ జ‌రుగుతుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు దాన్ని ఇక్కడికే తీసుకురావాన్నారు. వేదిక‌పై నుంచే రైతుల ఖాతాల్లో రైతు భ‌రోసా నిధులు జ‌మ చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇది రైతు రాజ్యం రైతు సంక్షేమ రాజ్య‌మ‌ని, రైతుల కోసం కృషి చేసే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వమ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement