Minister Ponnam Prabhakar | సామాజిక న్యాయానికి చాంపియన్ కాంగ్రెస్ : మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar | సామాజిక న్యాయానికి కాంగ్రెస్ చాంపియన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీలో బీసీ సంక్షేమశాఖపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బలహీన వర్గాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్పొరేషన్లను బలోపేతం చేస్తామన్నారు.
Minister Ponnam Prabhakar | సామాజిక న్యాయానికి కాంగ్రెస్ చాంపియన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీలో బీసీ సంక్షేమశాఖపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బలహీన వర్గాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్పొరేషన్లను బలోపేతం చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి ఒక్క కేసు కూడా పెండింగ్ లేదని, గ్రీన్ ఛానెల్ ద్వారా క్లియర్ చేస్తున్నామని వెల్లడించారు. సమగ్ర కుటుంబానికి సంబంధించిన దానిపై కేబినెట్‌లో చర్చించామని, సబ్ కమిటీ రివ్యూ చేసి సభ ముందుంచుతామని పేర్కొన్నారు. బలహీన వర్గాల బిడ్డగా బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి పని చేస్తున్నట్లు వివరించారు. ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఇచ్చారని, జీవో ఇచ్చి నిధులు ఇవ్వలేదన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విదేశీ స్కాలర్షిప్స్ సంవత్సరానికి 300 ఉండే ఇప్పుడు 700 పెంచుతున్నట్లు ప్రకటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో 327 పాఠశాలలు ఉంటే 27 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని, కిరాయి కట్టలేని తాళం వేసిన పరిస్థితి చూశామని గుర్తు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని, బీసీ సబ్ ప్లాన్ చేస్తున్నామన్నారు. కులాల కార్పొరేషన్లు నిధులు ఇస్తామన్నారు. బలహీన వర్గాల సంక్షేమంపై సభ్యులు సూచనలను తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వంలో బలహీన వర్గాలకు సంబంధించి కులాల కార్పొరేషన్లు నిధులు కేటాయించడంతో పాటు సంచార జాతులకు కార్పొరేషన్ పరిశీలన ఉందని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



