త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | రైళ్ల కేటాయింపులో కేంద్రం వివక్ష తగదు

Ponguleti Srinivas Reddy | న‌వంబ‌ర్ 1న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఢిల్లీలో చేపట్టిన భారీ ర్యాలీకి లక్షలాది మంది తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం రైళ్లు కేటాయించకపోవడం భావ్యం కాదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 28, 2026, 6.58 pm IST

Ponguleti Srinivas Reddy | రైళ్ల కేటాయింపులో కేంద్రం వివక్ష తగదు
Advertisement

కేంద్రంలో నిర‌స‌న‌ల‌కు ఆటంకం క‌ల్పిస్తున్న వారే
రాష్ట్రంలో పాద‌యాత్ర‌లు చేస్తున్నారు
ధ‌ర్నాచౌక్ ఎత్తేసిన బీఆర్ఎస్‌కు
ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్ : న‌వంబ‌ర్ 1న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఢిల్లీలో చేపట్టిన భారీ ర్యాలీకి లక్షలాది మంది తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం రైళ్లు కేటాయించకపోవడం భావ్యం కాదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిప‌డ్డారు. సచివాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ప్రభుత్వ విప్‌‌ వేముల వీరేశంతో కలిసి మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

సర్ (SIR) పేరుతో దేశవ్యాప్తంగా అర్హులైన వారి ఓటు హక్కును తొలగిస్తున్నారనే అంశంపై తక్షణమే ఎన్నికల ప్రధాన కమిషనర్‌ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీ కేంద్రంగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టినా కేంద్రప్రభుత్వం స్పందించడం లేదు అని మండిప‌డ్డారు.

రైల్వేలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సొత్తు కాదు. అవి భారత ప్రజల ఆస్తి. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను కేంద్రం అడ్డుకుంటే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో పాటు రైల్వే శాఖ వ్యవహారాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్ణయాలపై ప్రజా క్షేత్రంలోనే తేల్చు కుంటాం. ఇండియా కూటమి చేపట్టే నిరసనలకు ఆటంకాలు కల్పించే బీజేపీ నాయకులు వారు మాత్రం తెలంగాణలో పాదయాత్రలు చేపట్టాలని భావించడం ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలి. గతంలో ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు, నిరసనలు, ధర్నాలు చేపట్టేందుకు వేదికగా ఉన్న ఇందిర పార్కులో ధర్నా చౌక్‌ను ఎత్తివేసి, ప్రశ్నించే గొంతులను అణచివేసిన బీఆర్ఎస్ నాయకులు నేడు ప్రజాస్వామ్యం, నిరసన హక్కుల గురించి మాట్లాడటం పెద్ద హాస్యాస్పదం. చాలా విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నా చౌక్‌ను పునరుద్ధరించి, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించింది అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Advertisement
Advertisement