Bathukamma | టాంజానియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma | తెలంగాణ ఆడపడుచులు అత్యంత ఘనంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ( Bathukamma ) వేడుకలు టాంజానియాలోని దార్ ఎస్ సలాం నగరంలో ఘనంగా నిర్వహించారు.
International | Published On Oct 19, 2026, 3.16 pm IST
Bathukamma | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ఆడపడుచులు అత్యంత ఘనంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ( Bathukamma ) వేడుకలు టాంజానియాలోని దార్ ఎస్ సలాం నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖ్ సదన్ భవన్‌లో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టాంజానియాలోని భారత హైకమిషనర్ బిశ్వదీప్ దే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ వేడుకల్లో దాదాపు 600 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రకాల పూలతో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి, సాంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంబరాలు జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేసినందుకు అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (TCA) కమిటీ చైర్మన్ సైదులు, వైస్ చైర్మన్ సంపత్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వంగ నర్సింహారెడ్డి, సురేందర్ సీలం, సంతోష్ రెడ్డి పటోళ్ల, సంతోష్ రెడ్డి, మధు రెడ్డి, సూర్య మోహన్ రెడ్డి, ప్రవీణ్, మహేష్ రెడ్డి, కమిటీ సభ్యులు రమేష్,శరత్, రేవంత్, సాయి కృష్ణ, శ్రవణ్, శ్రీనివాస్, కార్తిక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
తాజావార్తలు
- ●Meta | తప్పుడు కంటెంట్‌పై కొరడా.. మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
- ●Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో సంచలన నిజాలు.. నేపాల్‌కు పారిపోవాలని నిందితుల ప్లాన్
- ●Tiger Shroff Attackers Arrested Kota | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. రాజస్థాన్‌లో దొరికిపోయిన ముగ్గురు షూటర్లు
- ●Riteish Deshmukh | తెలుగు సినిమాలో జెనీలియా భర్త - రామ్ కోసం విలన్‌గా మారిన బాలీవుడ్ హీరో
- ●LK Advani | ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
- ●RS Praveen Kumar | పోలీసుల జోక్యం మీద రాస్తే జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తరా?

Meta | తప్పుడు కంటెంట్‌పై కొరడా.. మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు

Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో సంచలన నిజాలు.. నేపాల్‌కు పారిపోవాలని నిందితుల ప్లాన్

Tiger Shroff Attackers Arrested Kota | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. రాజస్థాన్‌లో దొరికిపోయిన ముగ్గురు షూటర్లు

Riteish Deshmukh | తెలుగు సినిమాలో జెనీలియా భర్త - రామ్ కోసం విలన్‌గా మారిన బాలీవుడ్ హీరో






