Kalwakuntla Kavitha | కాఫర్ డ్యామ్ కట్టకుంటే పోరాటమే
Kalwakuntla Kavitha | కన్నెపల్లి పంప్‌హౌస్ (Kannepally Pump House) వద్ద వెంటనే కాఫర్ డ్యామ్ కట్టాలని.. లేదంటే ఇక్కడే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalwakuntla Kavitha) హెచ్చరించారు.
- రెండు నెలల్లో అయిపోతది.. మహా అయితే రూ.25 కోట్లు సరిపోతయ్
- ప్రాణహిత నుంచి రోజూ రెండు టీఎంసీల నీళ్లు సముద్రం పాలైతున్నయ్
- ప్రభుత్వం మా సూచనలను సీరియస్‌గా తీసుకోవాలి
- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్
Kalwakuntla Kavitha | త్రినేత్ర న్యూస్: కన్నెపల్లి పంప్‌హౌస్ (Kannepally Pump House) వద్ద వెంటనే కాఫర్ డ్యామ్ కట్టాలని.. రెండు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయొచ్చని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalwakuntla Kavitha) పేర్కొన్నారు. మహా అయితే రూ.25 కోట్లు సరిపోతాయన్నారు. నిపుణులతో మాట్లాడిన తర్వాతే ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నామని చెప్పారు. ప్రాణహిత నది నుంచి రోజూ రెండు టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు. తమ సూచనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. రైతుల పక్షాన నిలబడడం కోసమే ఈరోజు కన్నెపల్లి సందర్శనకు వచ్చినట్లు వివరించారు. సందర్శన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎంత కరువు కాలం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద న్న ప్రాణహిత నదిలో ప్రతిరోజు రెండు టీఎంసీల నీళ్లు ప్రవహించి వెళ్లిపోతూనే ఉంటయ్. కొన్ని బరాజ్‌లు కరాబ్ అయినయని సాకు చెప్పి సముద్రంలకు నీళ్లు వేస్ట్‌గా పోతుంటే గూడా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. గత పది పన్నెండేండ్లలో వర్షాలు బాగా పడడం వల్ల బీఆర్ఎస్ అయినా ఈ ప్రభుత్వం అయినా తప్పిచ్చుకోగలిగినయ్.
21 వేల చెరువుల్లో చుక్క నీరు లేదు
కానీ తెలంగాణలో ఇవాళ 21 వేల చెరువులు ఎండిపోయి భయంకరమైన పరిస్థితి ఉన్నది. చిన్న చిన్న చెరువులపై ఆధారపడి సాగు చేసుకునే రైతులకు కూడా నీళ్లు లేని దుస్థితి ఉంది. మేం ఒక్కటే డిమాండ్ చేస్తున్నం.. కన్నెపల్లి నుంచి కాఫర్ డ్యామ్ ఒకటి కట్టుకుంటే దాదాపు రెండు నెలల్లోపు అయిపోతది. మహా అయితే రూ.25 కోట్లతో ఈ నిర్మాణం అయిపోతది. ఈ వాటర్ మేడిగడ్డను బైపాస్ చేసుకుని, అన్నారం, సుందిళ్లతో పాటు ఇంకా ముందుకు వెళ్తాయి. మిగతా అన్నింటికి ఫీడ్ చేసే ఆస్కారం ఉంటది.
ప్రశ్నిస్తూ పరిష్కారం కూడా చూపిస్తున్నం
ప్రతి పార్టీ అనేక విమర్శలు చేస్తుంది. కానీ ఎటువంటి పరిష్కారం చూపించవు. తెలంగాణ రక్షణ సేన పార్టీ మాత్రం ప్రశ్నించడంతో పాటు పోరాడడంతో పాటు పరిష్కారాన్ని ప్రభుత్వానికి చూపిస్తున్నం. అనేక మంది నిపుణులతో మాట్లాడిన తర్వాత మేం సూచిస్తున్న సూచన ఇది. ప్రభుత్వం బేషజాలకు పోకుండా త్వరితగతిన ఈ పనిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నం. ఈ ప్రభుత్వానికి లేఖ కూడా రాస్తం.
వరి పొలాలన్నీ పొట్టకొచ్చి ఉన్నయ్.. నవంబర్ ఎండింగ్ లోపల నీళ్లు ఇయ్యకపోతే పంటలన్నీ ఎండిపోయే ఆస్కారం ఉంది. నేను, మా కార్యకర్తలంతా ప్రజల మంచిని కోరుకునేవాళ్లం. ఏదో పోరాటం చేస్తెనో, రెండు సార్లు టీవీల్లో కనబడితేనో లాభం లేదు. అందుకనే ఇంతదూరం వందలాది మందిమి వచ్చినం. తెలంగాణ రైతుల పక్షాన నిలబడడానికి వచ్చినం. ప్రభుత్వం వెంటనే ఈ సూచనలను సీరియస్‌గా తీసుకొని పనులు ప్రారంభించాలి. సీఎంకు రేపు ఓపెన్ లెటర్ రాస్తాం. నవంబర్ తర్వాత సీరియస్ కార్యాచరణ ప్రారంభిస్తాం. అవసరమైతే ఇక్కడే కూర్చుండి పోరాడుతాం.
మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు నష్టం చేయవద్దు. నిజానికి మన తెలంగాణలో ఉన్న రెండు పెద్ద నదులు గోదావరి, కృష్ణా నీళ్లను సరిగా వాడుకుంటే మనకు కరువు అనే పరిస్థితే ఉండదు. మనం తెలంగాణ కోసం పిడికిలి ఎత్తి ఉద్యమం చేసింది కూడా మా నీళ్లు మాకు కావాలనే. కానీ తెలంగాణ వచ్చాక మన నీటిని సంపూర్ణంగా వాడుకున్నామా అంటే వాడుకోలేదు. బీఆర్ఎస్ టైమ్ లో కృష్ణా నది ప్రాజెక్ట్ లపై కొంత పనులు చేసి 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు.
కచ్చితంగా కఠినంగానే ఉంటయ్..
ఉత్తర తెలంగాణలో ఎస్సారెస్పీ, కడెం, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు కు నీళ్లు ఇస్తూ 37 లక్షల ఎకరాలను స్థిరీకరణ చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసి స్థిరీకరణ మాత్రమే చేశారు. కాళేశ్వరంలో కొత్తగా లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఈ విషయం మనం చెబితే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మనపై దాడి చేస్తారు. కానీ నిజాలు మారవు. వాస్తవాలు కచ్చితంగా కఠినంగానే ఉంటాయి.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఘోరంగా పరిస్థితి తయారైంది. రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసి కొత్త ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. అడిగితే బకాయిలు చెల్లించామని చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, దళిత బంధు లాంటి బకాయిలు చెల్లించకుండా ఇవే ఎందుకు చెల్లించినట్టు? మేం పార్టీ పెట్టిన కొత్తలో కూడా కృష్ణానది నీళ్లకు సంబంధించి నార్లపూర్ వద్ద రిజర్వాయర్ గురించి సొల్యుషన్ చెప్పాం. ఎల్ నినో పరిస్థితుల కారణంగా వచ్చే ఏడాది కూడా వానలు పడుతాయో లేదో అని చెబుతున్నారు.
మా వల్లనే కేంద్రాన్ని కరెంట్ అడుగుతున్నరు
తెలంగాణలో కోటి 36 లక్షల సాగు భూమి ఉంటే ఈసారి కోటి 10 లక్షల ఎకరాలు సాగైంది. ఇప్పుడు పంట చివరి దశలో ఉంది. రైతులకు నీళ్లు, కరెంట్ అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుక్కొనైనా, కొనుక్కవచ్చైనా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాం. మేం డిమాండ్ చేసిన తర్వాతే ముఖ్యమంత్రి స్పందించి కేంద్రాన్ని కరెంట్ అడుగుతామని చెప్పారు. కాఫర్ డ్యామ్‌కు సంబంధించిన టెక్నికల్ డీయిటెల్స్ ను కూడా ప్రభుత్వానికి ఇస్తాం.
మేడిగడ్డను కూడా రిపేర్ చేసేందుకు ఇదే సరైన సమయం. ఆ పనులు కూడా మొదలు పెట్టాలి. ఇప్పుడు మేం చేస్తున్న సూచనతో మేడిగడ్డకు సంబంధం లేకుండానే మొత్తం నెట్ వర్క్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి రైతుకు తెలిసేలా పార్టీ నాయకులు వారికి వివరించాలి. కరెంట్, నీళ్లు ఇవ్వగలిగే పరిస్థితి ఉండి ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులను ఊర్లలో తిరగకుండా చేస్తాం. మేమిచ్చిన సూచనల్లో ఏమైనా మార్పులు ఉంటే..ఇంజినీర్లు వాటిని సరిచేసుకోమంటే చేసుకోవటానికి సిద్ధం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనిచేస్తే సరే. లేదంటే మా ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా ఈ ప్రతిపాదనలను పూర్తి చేస్తాం.
ఎక్కడ పొలాలను చూసినా సరే రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ ముఖ్యమంత్రి రైతులకు సంబంధించి సంఘాల్లో కూడా రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. రైతు సమస్యలకు సంబంధించిన సంఘాల్లో రాజకీయాలు వద్దని సూచిస్తున్నా. కాళేశ్వరం కోసం దాదాపు 93 వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. కాళేశ్వరం నీళ్లను ఇచ్చేందుకు కాలువలు తవ్వకపోవటంతో కొత్త గా 19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వటం సాధ్యం కావటం లేదు. ఆ కాలువలను పూర్తి చేయాలంటే మరో 50 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.
ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎలాగు అంత ఖర్చు చేసే పరిస్థితిలో లేదు. ఇప్పటికే ఎల్లంపల్లి సహా అన్ని రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయి. ఎల్లంపల్లిలో ఉన్న నీళ్లను తాగునీటి కోసం అని స్టోర్ చేశారు. రానున్న 10 నెలలు మనం భయంకరమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి కరువు వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేం చేస్తున్న మంచి సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి అని కవిత సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana | ఎల్ నినోపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
- ●Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా రష్మిక బతుకమ్మ సంబురం - ఫొటోలు చూశారా
- ●Chariot Festival | స్వర్ణరథంపై శ్రీనివాసుడి దర్శనం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు
- ●Southern Railway | రైళ్లలో గట్టిగా పాటలు వింటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు
- ●US Middle East Travel Alert 2026 | మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న సంక్షోభం: సౌదీ, యూఏఈ సహా 12 దేశాలకు అమెరికా 'సెక్యూరిటీ అలర్ట్'
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..

Telangana | ఎల్ నినోపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా రష్మిక బతుకమ్మ సంబురం - ఫొటోలు చూశారా

Chariot Festival | స్వర్ణరథంపై శ్రీనివాసుడి దర్శనం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు

Southern Railway | రైళ్లలో గట్టిగా పాటలు వింటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు









