Iron Rod | షాకింగ్.. బాలుడి నోట్లోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్..
Iron Rod | గుజరాత్‌లో ఐదేళ్ల బాలుడి నోట్లోకి ఇనుప రాడ్ ముక్క దూసుకెళ్లింది. పటాన్ జిల్లా సమీ తాలూకా వేద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సకాలంలో వైద్యులు స్పందించి చికిత్స చేయడంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Iron Rod | త్రినేత్ర న్యూస్ : గుజరాత్ (Gujarat)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో ఓ ఐదేళ్ల బాలుడి నోట్లోకి ఇనుప రాడ్ దూసుకెళ్లింది. ఈ ఘటన పటాన్ జిల్లా (Patan district) సమీ తాలూకా వేద్ గ్రామంలో వెలుగు చూసింది. అయితే, వైద్యుల చొరవతో అదృష్టవశాత్తూ ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
అధికారుల సమాచారం ప్రకారం.. బాలుడు తన ఇంటి సమీపంలో ఆరుబయట ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక పదునైన ఇనుప రాడ్ నేరుగా బాలుడి నోట్లోకి దూసుకెళ్లింది. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. నొప్పికి చిన్నారి అల్లాడిపోయాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని రాధన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి (Radhanpur Government Hospital) తీసుకెళ్లారు.
బాలుడిని పరీక్షించిన వైద్యులు ఇనుప రాడ్ దవడలు, పంటి సమీపంలో లోతుగా ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. రాడ్ ఉన్న స్థానం చాలా సున్నితమైనది కావడంతో దాన్ని తొలగించడానికి ప్రత్యేక వైద్య సహాయం అవసరమైంది. దీంతో వైద్య సిబ్బంది ఓ ప్రైవేట్ డెంటల్ సర్జన్‌ను పిలిపించి శస్త్రచికిత్స చేసింది. వైద్యులు దాదాపు గంటపాటూ శ్రమించి దవడకు, చుట్టుపక్కల కణజాలానికి ఎలాంటి హాని కలగకుండా బాలుడి నోట్లో ఇరుక్కుపోయిన రాడ్‌ను విజయవంతంగా తొలగించారు. రాధన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ప్రైవేట్ వైద్యులు సకాలంలో స్పందించి చేసిన కృషితో బాలుడి ప్రాణాలు నిలిచాయి. ఆపరేషన్ అనంతరం దంత వైద్యులు డాక్టర్ డీఎస్ సోధా మాట్లాడుతూ.. పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని, పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Also Read..
తప్పుడు కంటెంట్‌పై కొరడా.. మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
సంబంధిత వార్తలు

Lawrence Bishnoi | బాలీవుడ్ నటులే టార్గెట్.. ఇంతకీ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్
అక్టోబర్ 19, 2026

blast at chemical unit | రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి
అక్టోబర్ 17, 2026

IV Drip Therapy | నవరాత్రి వేళ జెన్ జీ యువత కొత్త ట్రెండ్.. గర్భా వేడుకల్లో అలసిపోకుండా ఉండేందుకు ఐవీ డ్రిప్ థెరపీ
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●Bathukamma | టాంజానియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ●Devika Bhatt | తెలుగు ఇండస్ట్రీలోకి మరో కన్నడ బ్యూటీ - సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి...
- ●Minister Seethakka | బతుకమ్మ వేడుకల్లో రష్మిక పాల్గొనడం ఎంతో హ్యాపీ : మంత్రి సీతక్క
- ●Meta | తప్పుడు కంటెంట్‌పై కొరడా.. మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
- ●Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో సంచలన నిజాలు.. నేపాల్‌కు పారిపోవాలని నిందితుల ప్లాన్
- ●Tiger Shroff Attackers Arrested Kota | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. రాజస్థాన్‌లో దొరికిపోయిన ముగ్గురు షూటర్లు

Bathukamma | టాంజానియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Devika Bhatt | తెలుగు ఇండస్ట్రీలోకి మరో కన్నడ బ్యూటీ - సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి...

Minister Seethakka | బతుకమ్మ వేడుకల్లో రష్మిక పాల్గొనడం ఎంతో హ్యాపీ : మంత్రి సీతక్క

Meta | తప్పుడు కంటెంట్‌పై కొరడా.. మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు



