Suzlon Energy | 6 నెలల్లో 20 శాతానికి పైగా పతనం.. సుజ్లాన్ షేర్లలో మళ్లీ ర్యాలీ రాబోతుందా..?
Suzlon Energy | సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లలో సోమవారం ఉదయం అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈ షేరు రూ.41.58 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే రూ.40.83 కనిష్ఠ స్థాయిని తాకింది. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు దాదాపు 3 శాతం పడిపోయింది.
Suzlon Energy | సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లలో సోమవారం ఉదయం అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈ షేరు రూ.41.58 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే రూ.40.83 కనిష్ఠ స్థాయిని తాకింది. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు దాదాపు 3 శాతం పడిపోయింది. ఇప్పటికే గత ఆరు నెలల్లో 20 శాతానికి పైగా నష్టపోయిన ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్‌పై మార్కెట్ నిపుణులు మాత్రం సానుకూల అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ఖర్చులను నియంత్రించి, లాభాల మార్జిన్లను మెరుగుపరచగలిగితే షేరుకు మళ్లీ విలువ పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నష్టాల్లో ఉన్న కంపెనీల జాబితా నుంచి బయటపడి లాభాల్లోకి వచ్చిన సమయంలోనే సుజ్లాన్ ఎనర్జీ షేర్లకు తొలిసారి రీ-రేటింగ్ లభించింది. ఇప్పుడు కంపెనీ లాభాల మార్జిన్లు గణనీయంగా మెరుగుపడడంపై మార్కెట్ దృష్టి సారించింది. ఇందుకోసం అధిక నిర్వహణ వ్యయాలను నియంత్రించడం కీలకమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ ఖర్చులను అదుపులోకి తీసుకురాగలిగితే షేరుకు మరోసారి రీ-రేటింగ్ లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ప్రస్తుత ధరల వద్ద ఏర్పడుతున్న పతనాన్ని అవకాశంగా తీసుకుని, తమ పోర్ట్‌ఫోలియోలో సుజ్లాన్ షేర్లను క్రమంగా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. షేరు సగటు వెయిటెడ్ ధర రూ.38 నుంచి రూ.40 మధ్య ఉండడంతో మరింత పతనానికి అవకాశాలు పరిమితంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
సుజ్లాన్ ఎనర్జీ షేరు ఎందుకు పడిపోతోంది?
సుజ్లాన్ ఎనర్జీ షేరు ధరను ప్రభావితం చేస్తున్న అంశాలపై ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ స్పందించారు. కంపెనీ నష్టాల నుంచి బయటపడి లాభాల్లోకి వచ్చినప్పుడు షేరుకు తొలి విడత రీ-రేటింగ్ లభించిందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామాన్ని మార్కెట్ ఇప్పటికే ధరల్లో పరిగణనలోకి తీసుకుందని వివరించారు. ఇప్పుడు కంపెనీ లాభాల మార్జిన్లు మరింత మెరుగుపడతాయా లేదా అన్నదానిపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారని తెలిపారు. నష్టాల దశను అధిగమించి లాభాల్లోకి వచ్చిన కంపెనీ తన మార్జిన్లను పెంచుకోగలిగితేనే తదుపరి దశ వృద్ధికి అవకాశాలు ఏర్పడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. సుజ్లాన్ తన అధిక వ్యయాలను నియంత్రించి, లాభాల మార్జిన్లను పెంచుకోవాలని మార్కెట్ ఆశిస్తోందని సీమా శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ మార్పులు కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో స్పష్టంగా కనిపించినప్పుడు షేరుకు రెండో విడత రీ-రేటింగ్ లభించే అవకాశం ఉందని వివరించారు.
సుజ్లాన్ షేర్లను కొనుగోలు చేయడానికి 3 కారణాలు..
సీమా శ్రీవాస్తవ సుజ్లాన్ ఎనర్జీ షేర్లను కొనుగోలు చేయడానికి మూడు ప్రధాన కారణాలను వెల్లడించారు. కంపెనీకి మరోసారి రీ-రేటింగ్ లభించే అవకాశాలు ఉండడం మొదటి కారణం. ఇప్పటికే షేరు గణనీయంగా పడిపోవడంతో మరింత నష్టపోయే అవకాశం పరిమితంగా ఉంటుందనే అంచనా రెండో కారణం. ముడి చమురు ధరలు అధిక స్థాయిల్లో కొనసాగుతున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉండడం మూడో కారణంగా ఆమె పేర్కొన్నారు. సుజ్లాన్ ఎనర్జీ షేరులో మరింత పతనానికి అవకాశాలు పరిమితంగా ఉంటాయని కే.సీ. సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగానికి చెందిన మహేశ్ ఎం. ఓజా అభిప్రాయపడ్డారు. దలాల్ స్ట్రీట్‌లో ఇప్పటికే గణనీయంగా పడిపోయిన షేర్లలో సుజ్లాన్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత ఏతేడాది కాలంలో ఈ షేరు 25 శాతం, 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 22 శాతం క్షీణించిందని వివరించారు. ఇప్పటికే తగ్గింపు ధర వద్ద ట్రేడవుతున్నందున మరింత భారీ పతనానికి అవకాశాలు పరిమితంగా ఉంటాయని అంచనా వేశారు.
షేరు రీ-రేటింగ్ తర్వాత నమోదైన సగటు వెయిటెడ్ ధర సుమారు రూ.38 నుంచి రూ.40 మధ్య ఉందని మహేశ్ ఎం. ఓజా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు సుజ్లాన్ షేర్లపై విశ్వాసంతో కొనసాగవచ్చని సూచించారు. ఆనంద్ రాఠీకి చెందిన డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్ రీసెర్చ్ విభాగం నిపుణుడు మెహుల్ కొఠారి కూడా సుజ్లాన్ షేర్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ ధర వద్ద ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచించారు. రూ.38 స్థాయిలో ఈ షేరుకు బలమైన మద్దతు ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులు వాటిని కొనసాగించాలని, అయితే తక్షణ లక్ష్య ధర రూ.46గా పెట్టుకుని రూ.38 వద్ద స్టాప్‌లాస్‌ను పాటించాలని సూచించారు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించవచ్చని మెహుల్ కొఠారి తెలిపారు. అంటే సుజ్లాన్ షేర్లను కొనుగోలు చేసి కొనసాగిస్తూ, రూ.46 లక్ష్య ధరను నిర్దేశించుకోవాలని, ధర రూ.38కు పడిపోతే నష్టాన్ని పరిమితం చేసేందుకు స్టాప్‌లాస్‌ను అమలు చేయాలని సూచించారు.
ముఖ్య గమనిక: ఇవి మార్కెట్ నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అంచనాలు మాత్రమే. షేరు ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతాయి. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
తాజావార్తలు
- ●IMD | ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ
- ●Lawrence Bishnoi Sahab | గ్యాంగ్‌స్టర్‌కు 'సాహెబ్' మర్యాదా? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వేళ పోలీసుల పాత వీడియోతో దుమారం
- ●Kalwakuntla Kavitha | కాఫర్ డ్యామ్ కట్టకుంటే పోరాటమే
- ●Iron Rod | షాకింగ్.. బాలుడి నోట్లోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్..
- ●Bathukamma | టాంజానియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ●Devika Bhatt | తెలుగు ఇండస్ట్రీలోకి మరో కన్నడ బ్యూటీ - సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి...

IMD | ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ

Lawrence Bishnoi Sahab | గ్యాంగ్‌స్టర్‌కు 'సాహెబ్' మర్యాదా? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వేళ పోలీసుల పాత వీడియోతో దుమారం

Kalwakuntla Kavitha | కాఫర్ డ్యామ్ కట్టకుంటే పోరాటమే

Iron Rod | షాకింగ్.. బాలుడి నోట్లోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్..



