Pongulati Srinivas Reddy | డ్రామారావు, అగ్గిపెట్టె రావు.. పేర్లకు తగ్గట్టే డ్రామాలు : మంత్రి పొంగులేటి
Pongulati Srinivas Reddy | మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. డ్రామారావు, అగ్గిపెట్టె రావు.. పేర్లకు తగ్గట్టే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
Pongulati Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. డ్రామారావు, అగ్గిపెట్టె రావు.. పేర్లకు తగ్గట్టే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
పది సంవత్సరాలు దొరల పోకడలు, అహంకారంతో పేదలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ నేతలు, పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు. గడిచిన కొద్ది రోజుల నుంచి వారి తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు.. మీ పాలనలో రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టారో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఆధారాలతో సహా బట్టబయలు చేసిన సంగతిని మరిచిపోతున్నారు. సవాల్ అంటారు.. సర్ధుకుని పోతారు.. మీరా కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చల మీద మాట్లాడేది..? అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
వాకౌట్ తప్ప.. ఏ చర్చను స్వీకరించారు మీరు..?
మీరు చేసిన అప్పులు, ఆర్థిక దోపిడి మీద శ్వేత పత్రం విడుదల చేసి చర్చపెడితే వాకౌట్ చేస్తారు. మీరు చేసిన విద్యుత్ కొనుగోళ్లలో అడ్డగోలు తప్పులపై చర్చపెడితే వాకౌట్ చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మీరు చేసిన అవినీతి పై చర్చ పెడితే వాకౌట్ చేస్తారు. గొర్రెల పంపిణీలో మీరు చేసిన అవినీతి ఘనకార్యం పై చర్చ పెడితే వాకౌట్ చేస్తారు. ఏ చర్చను మీరు స్వీకరించారు ? ఏ చర్చను ఎదుర్కుని సమాధానమిచ్చారు ఇంతవరకు..? అని నిలదీశారు.
మీకంటుకున్న అవినీతి బురదను మాకు అంటిస్తారా..?
అంతే కాదు ఇప్పటికీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ప్రజాప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద, మంత్రులపై ప్రతిరోజు అసత్య ఆరోపణలు, అబద్ధాలతో మాట్లాడుతూ.. మీకంటుకున్న అవినీతి బురదను ఈ ప్రజాప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారు. గురుకులాలలో కూడా టెండరు వేసిన మొత్తం కంటే మూడు రెట్ల అవినీతి జరిగిందని, మీరు పొంతనలేని ఆరోపణలు చేస్తుంటే.. మీ తలతిక్క లెక్కలపై చర్చకు సిద్ధమై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, ఇతర కాంగ్రెస్ నాయకులు గన్‌పార్క్‌కు రావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, కాంగ్రెస్ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. చెప్పిన సమయానికి రాకుండా తోక ముడిచినారన్నదానికి మీరు మీ పార్టీ ఆఫీస్ రోడ్డు మీద చేసిన డ్రామాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఆ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వరు
పదేండ్ల పాలనలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి.. అధికారం కోల్పోయిన తర్వాత ఫార్మ్‌హౌస్ రాష్ట్ర సమితి (FRS) పార్టీలో పట్టు కోసం బావ బామ్మర్దులు సాగిస్తున్న ఆధిపత్య పోరాటంలో భాగంగానే ఈ రాజకీయ డ్రామాలు ఆడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. గ్లోబల్ ప్రచారాన్ని ఇప్పటికైనా మానుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయిన వచ్చింది. ఇదే ప్రవర్తన, ఇదే తీరుతో బీఆర్ఎస్ నేతలు నడుచుకుంటే భవిష్యత్తులో ఆ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వరు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..
- ●OPS | పెన్షన్ మా హక్కు.. అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగుల నిరసన
- ●Nimisha Sajayan | సినిమా కోసం 14 కిలోల బరువు పెరిగిన మలయాళం హీరోయిన్
- ●Forum For Good Governance | ఏ ఎమ్మెల్యే కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదు
- ●Sircilla | ప్రత్యామ్నాయ పంటలతో నిరంతర ఆదాయం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
- ●India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?

Telangana Brahmin Samkshema Parishad | బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 31 కోట్లు విడుదల చేయండి..

OPS | పెన్షన్ మా హక్కు.. అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగుల నిరసన

Nimisha Sajayan | సినిమా కోసం 14 కిలోల బరువు పెరిగిన మలయాళం హీరోయిన్

Forum For Good Governance | ఏ ఎమ్మెల్యే కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదు



