త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వామ్యం కావాలి : మంత్రి కొండా సురేఖ‌

Konda Surekha | గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలి అని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Mar 13, 2026, 4.48 pm IST

Konda Surekha | ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వామ్యం కావాలి : మంత్రి కొండా సురేఖ‌
Advertisement

Konda Surekha | త్రినేత్ర‌.న్యూస్ : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలి అని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, సర్పంచ్ నుంచి మంత్రి వరకు అందరూ స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్న‌ట్టు మంత్రి సురేఖ పేర్కొన్నారు.

వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం మరియాపురం గ్రామంలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లాలోని ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా అధికారులు పని చేస్తూ, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడం, గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కొండా సురేఖ తెలిపారు.

Advertisement
Advertisement