త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Rajanarasimha | అన్నిరంగాల్లో హైద‌రాబాద్ అభివృద్ధి : మంత్రి దామోద‌ర‌

Damodar Rajanarasimha | హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని వైద్యారోగ్య‌శాఖ మంత్రి దామోదర్ రాజనర్శింహ తెలిపారు. ఫార్మా, ఐటీ హబ్‌గా హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

P

Telangana | Published On May 5, 2026, 8.20 pm IST

Damodar Rajanarasimha | అన్నిరంగాల్లో హైద‌రాబాద్ అభివృద్ధి : మంత్రి దామోద‌ర‌
Advertisement

Damodar Rajanarasimha | హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని వైద్యారోగ్య‌శాఖ మంత్రి దామోదర్ రాజనర్శింహ తెలిపారు. ఫార్మా, ఐటీ హబ్‌గా హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తన నివాసంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న “చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్’ ఫ‌స్ట్ ఫార్మాట్ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివ‌ల్ వాల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మిడిల్ ఈస్ట్, యూరోపియన్ దేశాలు, ఆఫ్రికా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య సేవల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారని పేర్కొన్నారు.

అలాగే ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు హైదరాబాద్‌ను ప్రధాన వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. సినిమా, ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా రంగాల్లో ప్రభావం చూపుతున్న ప్రముఖులందరూ ఒకే వేదికపై కలిసే విధంగా ఈ ఫెస్టివల్‌ను రూపొందించడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కార్యక్రమంలో 43 దేశాల ప్రతినిధులు, దేశంలోని ఎనిమిది రాష్ట్రాల నుంచి ఫిల్మ్ మేకర్స్ పాల్గొననున్నారు. సినిమా, ఓటీటీ, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒకే వేదికపై కలవడం ఇదే మొదటిసారి అని వారు తెలిపారు. నిర్వాహకుల కృషిని మంత్రి దామోదర్ రాజనర్శింహ అభినందించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement