Adluri Lakshman | పదేండ్లు రాజ్యాధికారం అనుభవించి.. అహంకారంతో మాట్లాడుతున్నారు.. కేటీఆర్, హరీశ్‌పై మంత్రి అడ్లూరి ఫైర్
Adluri Lakshman | కేటీఆర్, హరీశ్ రావు పదేండ్లు రాజ్యాధికారం అనుభవించి, అహంకారంతో మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) విమర్శించారు. కాళేశ్వరం కమిషన్‌తో కూలేశ్వరం చేశారని మండిపడ్డారు.
Adluri Lakshman | త్రినేత్ర.న్యూస్: కేటీఆర్, హరీశ్ రావు పదేండ్లు రాజ్యాధికారం అనుభవించి, అహంకారంతో మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) విమర్శించారు. కాళేశ్వరం కమిషన్‌తో కూలేశ్వరం చేశారని మండిపడ్డారు. జీవన్ రెడ్డి భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. జగిత్యాలలోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. `కేసీఆర్ సభ సామర్థ్యం రూ.15 వేలకు మించదు. దానికి హెలికాప్టర్ వస్తున్నారు. కానీ కొండగట్టులో 60 మంది ప్రమాదవశాత్తూ చనిపోతే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి భుజాలపై తుపాకీ పెట్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్‌తో కులేశ్వరం చేశారు.
కనీస గౌరవం ఇవ్వలే..
గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకునికి కనీస గౌరవం ఇవ్వలేదు. నేను రాజు, నేను మంత్రి తరహా గత ప్రభుత్వ పాలన సాగింది. ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా వారి తీరు మారడం లేదు. ముఖ్యమంత్రి మేడిగడ్డ పరిశీలనకు 15 రోజుల క్రితమే నీటి పారుదల శాఖ రివ్యూలో తేదీ ఫిక్స్ అయింది. దక్షిణ భారత దేశానికి నరేంద్ర మోడీ చేస్తున్న అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ధర్మపురి అభివృద్ధిపై చర్చకు సిద్ధం. గోదావరి పుష్కరాల కోసం ప్రణాళిక బద్దంగా గొప్పగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక్క నూతన భవనం మంజూరు చేయలేదు. సొంత డబ్బా కోసమే జగిత్యాల బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు` అని మంత్రి విమర్శించారు.
కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం..
కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం హరీశ్ రావు, కేటీఆర్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. 2014లో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను నేడు అప్పుల కుప్పగా మార్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఫామ్ హౌస్‌కి పరిమితం అయ్యారు. సంక్షేమ పథకాల అమలుతో రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సొంత డబ్బా కొడుతూ గద్దె నెక్కలని బీఆర్ఎస్ అనుకుంటుంది. కంటోన్మెంట్ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 25 వేల ఓట్లతో ఓడిపోయారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టమైంది. నియోజకవర్గ పునర్విభజన విషయంలో దక్షిణ భారతానికి నష్టం జరుగుతున్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తారు. 2011, 2023లో మహిళ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అహంకారంతో ఉన్నాయి.
జగిత్యాల సభ సొంత ఎజెండా తో నిర్వహించారు. అది ప్రజల ఎజెండా ఎంత మాత్రం కాదు. వరద కాలువను ఎల్లంపల్లి ద్వారా నింపితే అది కూడా కాళేశ్వరం అని అసత్య ప్రచారం చేస్తున్నారు. క్రాస్ బ్రీడ్, హై బ్రీడ్ అనే పదాలు బీఆర్ఎస్ నాయకులకే వర్తిస్తాయి. పార్టీ పిరాయింపుల పితామహుడు కేసీఆర్` అని ఆది శ్రీనివాస్ విమర్శించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



