Methuku Anand | అజ్మత్ కొన్న భూమిని రేవంత్ కబ్జా చేస్తుండు
Methuku Anand | వికారాబాద్ (Vikarabad) పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో అజ్మత్ కొన్న భూమిని సీఎం రేవంత్‌రెడ్డి కబ్జా (Land Encroachment) చేసే ప్రయత్నం చేస్తున్నారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ (Methuku Anand) ఆరోపించారు.
- బల్మూర్ వెంకట్ అజ్మత్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నడు
- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపణలు
Methuku Anand | త్రినేత్ర న్యూస్: వికారాబాద్ (Vikarabad) పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో అజ్మత్ కొన్న భూమిని సీఎం రేవంత్‌రెడ్డి కబ్జా (Land Encroachment) చేసే ప్రయత్నం చేస్తున్నారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ (Methuku Anand) ఆరోపించారు. ఇందుకోసం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌ను ముందుంచి కథ నడిపిస్తున్నారన్నారు. శుక్రవారం సదరు వివాదాస్పద స్థలాన్ని ఆయన సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
సుమారు 18 సంవత్సరాల క్రితం అజ్మత్ కొనుగోలు చేసిన స్థలానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అజ్మత్ నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను పోలీసుల సమక్షంలో బలవంతంగా కూల్చివేశారు. కోర్టు ఆదేశాల మేరకు స్థలంలోకి ప్రవేశించొద్దని ఏర్పాటు చేసిన బోర్డుకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అజ్మత్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, పొలంలో నుంచి దారి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బల్మూర్ వెంకట్ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
అధికారులు తక్షణమే స్పందించాలి
బాధితుల పక్షాన న్యాయం ఉందని చెబుతున్నప్పటికీ, 74 సంవత్సరాల వయస్సున్న పెద్దమనిషిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్‌లో ఉంచడం ఎంతవరకు సమంజసం? పేద, సామాన్య ప్రజల భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలి. భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అని ఆనంద్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 14 రాశిఫలాలు.. కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తారు!
- ●Delhi Pollution | ఢిల్లీలో విషవాయువులు.. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే 20 రెట్లు అధికంగా కాలుష్యం!
- ●Vikarabad | అండర్-19 జట్టుకు ఎంపికైనా.. అంతలోనే విషాదం!
- ●Poonam Bajwa | బికినీలో టాలీవుడ్ హీరోయిన్ - తడి అందాలతో హీటేక్కిస్తున్న బ్యూటీ
- ●ICC Player of the Month Award | ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దీప్తి శర్మ..
- ●Bollywood | ప్రియురాలితో బాలీవుడ్ హీరో రొమాంటిక్ ఫొటోషూట్

Horoscope | నవంబర్ 14 రాశిఫలాలు.. కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తారు!

Delhi Pollution | ఢిల్లీలో విషవాయువులు.. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే 20 రెట్లు అధికంగా కాలుష్యం!

Vikarabad | అండర్-19 జట్టుకు ఎంపికైనా.. అంతలోనే విషాదం!

Poonam Bajwa | బికినీలో టాలీవుడ్ హీరోయిన్ - తడి అందాలతో హీటేక్కిస్తున్న బ్యూటీ







