Telangana Cyber Security Bureau | సామాన్యులకు డబ్బు ఆశ చూపి వాళ్ల డాక్యుమెంట్స్‌తో మ్యూల్ అకౌంట్లు తెరిచి..
5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం.. 1,172 కేసులు! అమాయకుల బ్యాంక్ అకౌంట్లతో రూ.17 కోట్ల ఫ్రాడ్ చేసిన 101 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను తెలంగాణ పోలీసులు పక్కా స్కెచ్‌తో పట్టేశారు.
సంక్షిప్త సారాంశం
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సౌత్ ఇండియాలోని 5 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 101 మందిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో 18 మంది మహిళలతో పాటు 19 మంది ఏజెంట్లు, అక్రమ లావాదేవీలకు సహకరించిన 81 మంది ‘మ్యూల్ అకౌంట్’ హోల్డర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా నమోదైన 1,172 సైబర్ కేసులతో ఈ ముఠాకు లింకులు ఉండగా, దాదాపు రూ.17 కోట్ల మోసపూరిత లావాదేవీలను పోలీసులు గుర్తించారు. అమాయకులకు 5 శాతం కమిషన్ ఆశచూపి బ్యాంక్ ఖాతాలు సేకరించి, ఆ సొమ్మును హవాలా/క్రిప్టో రూపంలో విదేశాలకు తరలించినట్లు వెల్లడైంది.
- సైబర్ నేరగాళ్లపై తెలంగాణ పోలీసుల పంజా
- 5 రాష్ట్రాల్లో, పుదుచ్చేరిలో 101 మంది అరెస్ట్
- రూ.17 కోట్ల గుట్టురట్టు
Telangana Cyber Security Bureau | త్రినేత్ర న్యూస్ : దేశవ్యాప్తంగా అమాయకుల బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతూ, నకిలీ లావాదేవీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ గ్యాంగ్‌ల ఆటకట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రంగంలోకి దిగింది. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండు వారాల పాటు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించి.. ఏకంగా 101 మంది సైబర్ కేటుగాళ్లను కటకటాల వెనక్కి నెట్టింది.
రెండు వారాల వేట.. 5 రాష్ట్రాల్లో సోదాలు
తెలంగాణ పోలీసుల ప్రత్యేక బృందాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలో పక్కా ప్రణాళికతో ఆపరేషన్ చేపట్టాయి. సెప్టెంబర్ 23 నుంచి నిరంతరాయంగా సాగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 83 మంది పురుషులు, 18 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 19 మంది ప్రధాన ఏజెంట్లు కాగా, సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంక్ ఖాతాలను అప్పగించిన 81 మంది 'మ్యూల్ అకౌంట్' హోల్డర్లు ఉన్నారు.
1,172 కేసులు.. రూ.17 కోట్ల లావాదేవీలు
దేశవ్యాప్తంగా నమోదైన ఏకంగా 1,172 సైబర్ నేరాల కేసులతో ఈ ముఠాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెట్‌వర్క్ ద్వారా దాదాపు రూ.17 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించారు. అమాయకులను మభ్యపెట్టి ఓపెన్ చేయించిన బ్యాంక్ అకౌంట్లను ఈ ముఠా సైబర్ మోసాల డబ్బును మళ్లించడానికి ఉపయోగించుకుంది.
5% కమిషన్ ఆశచూపి ఖాతాల సేకరణ: TGCSB డైరెక్టర్ శిఖాగోయల్
ఈ రాకెట్ నడిచిన తీరుపై TGCSB డైరెక్టర్ శిఖాగోయల్ వివరాలు వెల్లడిస్తూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అమాయకులకు 5 శాతం వరకు కమిషన్ ఎరగా వేసి ఏజెంట్లు వారి బ్యాంక్ పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డులను సేకరించేవారని తెలిపారు. ఆ ఖాతాల్లోకి బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును జమచేసి, ఆపై వేగంగా విదేశాలకు తరలించేవారని వివరించారు.
దాడుల సందర్భంగా నిందితుల వద్ద నుంచి భారీగా డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు, పాస్‌బుక్‌లు, వైర్‌లెస్ నెట్‌వర్కింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులందరినీ ఆయా స్థానిక కోర్టుల నుంచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా హైదరాబాద్‌కు తరలించి విచారిస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతాలను ఎవరికీ ఇవ్వొద్దని, కమీషన్ల కోసం మోసగాళ్లకు ఖాతాలు అప్పగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Also Read | ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు
తాజావార్తలు
- ●MLA Malreddy Rangareddy | విద్యార్థినులతో ప్రేమగా మాట్లాడినా.. తప్పేముంది
- ●Stock Markets | ఆర్బీఐ వడ్డీ షాక్.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు..
- ●Home Loan EMI | వడ్డీ రేట్ల పెంపుతో ఇంటి రుణాలపై ఎఫెక్ట్.. ఈఎంఐ ఎంత పెరుగుతుంది..?
- ●Nobel Prize 2026 | రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్
- ●Singireddy Niranjan Reddy | అరగుంట అక్రమం అని తేలినా ముక్కు నేలకు రాస్తా
- ●MLC Deshapathi Srinivas | చిత్తశుద్ధి ఉంటే ఫోర్త్ సిటీలో అమరుల కాలనీ కట్టు

MLA Malreddy Rangareddy | విద్యార్థినులతో ప్రేమగా మాట్లాడినా.. తప్పేముంది

Stock Markets | ఆర్బీఐ వడ్డీ షాక్.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు..

Home Loan EMI | వడ్డీ రేట్ల పెంపుతో ఇంటి రుణాలపై ఎఫెక్ట్.. ఈఎంఐ ఎంత పెరుగుతుంది..?

Nobel Prize 2026 | రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్



