Rajya Sabha Polls | కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
Meenakshi Natarajan | రాజ్యసభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దాంతో బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవట్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించారు.
Meenakshi Natarajan | రాజ్యసభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దాంతో బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవట్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించారు. నామినేషన్ పరిశీలన సందర్భంగా రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిస్కరించారు. హైదరాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించిన వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని, ఈ నేపథ్యంలోనే నామినేషన్‌ను తిస్కరించినట్లుగా తెలుస్తోంది.
కేసు వివరాల్లోకి వెళితే.. 2025 మే 11న ఏ శ్రీలత అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆగస్టు 20న హైదరాబాద్‌లోని నాల్గో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మీనాక్షి నటరాజన్ సహా ఇతరులపై అధికారిక ఫిర్యాదు దాఖలైంది. సెప్టెంబర్ 17న కోర్టు ఆమెను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అక్టోబర్ 24న మీనాక్షి తరఫున న్యాయవాది కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి, కేసును రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. అయితే, నవంబర్ 17న కేసును కొట్టివేసేందుకు నిరాకరించిన కోర్టు.. విచారణ కొనసాగించేందుకు నిర్ణయించింది. నామినేషన్ పత్రాల్లో మీనాక్షి ఈ కేసును ప్రస్తావించలేదని బీజేపీ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా.. మీనాక్షి నటరాజన్ గతంలో లోక్‌సభ సభ్యురాలిగా సేవలందించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించడంతో పాటు కాంగ్రెస్‌లో కీలక బాధ్యతల్లో ఉన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Union Minister Kishan Reddy | నీలా హాజరు వేయించుకునే వ్యక్తిని కాదు.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కిషన్‌రెడ్డి కౌంటర్..!
జూన్ 9, 2026

Muharram | మొహర్రం వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
జూన్ 9, 2026

Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●Muharram | మొహర్రం వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ
- ●Minister Sridhar Babu | పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు
- ●Nayanthara | నయనతార పెళ్లి రోజు - రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన డైరెక్టర్
- ●Chandrayangutta | హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
- ●Solar Power | నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

Muharram | మొహర్రం వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ

Minister Sridhar Babu | పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు

Nayanthara | నయనతార పెళ్లి రోజు - రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన డైరెక్టర్



