Mee Ticket App | చెప్పండి క్యూలైన్‌కు బైబై..! ఇక టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
Mee Ticket App | తెలంగాణలో ప్రయాణం, పర్యటన టికెట్ల బుకింగ్‌ను సులభతరం చేస్తూ ‘మీ టికెట్’ యాప్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బస్, మెట్రో ప్రయాణ టికెట్లతో పాటు ఆలయాలు, పార్కులు, మ్యూజియం, ఫారెస్ట్ సఫారీ వంటి సందర్శన స్థలాల ఎంట్రీ టికెట్లను కూడా ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తోనే సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 219 ప్రదేశాల్లో ఈ యాప్ ద్వారా ఎంట్రీ టికెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని సేవలను విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Mee Ticket App | వీకెండ్ వచ్చిందంటే ఫ్యామిలీతో బయటకు వెళ్లాలన్న ప్లాన్ సహజమే. మెట్రో ప్రయాణమా.. ఆలయ దర్శనమా.. పార్క్, మ్యూజియంలో ఏదీ అన్న ఆలోచన మొదలవుతుంది. గోల్కొండ కోట, ఫారెస్ట్ సఫారీ వంటి చోట్లకు వెళ్లాలన్నా, తీరా అక్కడికి వెళ్లాక టికెట్ కౌంటర్ వద్ద క్యూలైన్లు చూసి వెనుదిరిగే పరిస్థితి చాలామందికి ఎదురవుతోంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ‘మీ టికెట్ యాప్’తో డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసింది. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, ఒక్క క్లిక్‌తోనే ప్రయాణ టికెట్లతో పాటు వివిధ సందర్శన స్థలాల ఎంట్రీ టికెట్లను ముందుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్లే స్టోర్ నుంచి మీ టికెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఇంటి నుంచే బస్, మెట్రో ప్రయాణ టికెట్లు, ఆలయాలు, పార్కులు, మ్యూజియం, ఫారెస్ట్ సఫారీ వంటి ప్రాంతాల టికెట్లను సులభంగా పొందవచ్చు. కౌంటర్ వద్ద నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఎంట్రీకి వెళ్లే వీలును ఈ యాప్ కల్పిస్తోంది.
మీ సేవ ఆధ్వర్యంలో..
ఐటీ శాఖ పరిధిలోని మీ సేవ ఆధ్వర్యంలో రూపొందిన ఈ యాప్ ద్వారా ఒకే వేదికపై అనేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇండోర్, అవుట్‌డోర్ టూరిజం సర్వీసులతో పాటు ప్రయాణ సౌకర్యం సేవలు అందిస్తోంది. ఈవీ వాహనాల్లో ప్రయాణించే వారికి సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ల సమాచారం కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. పౌరుల నిత్య జీవితాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ సేవలను విస్తరించారు. ప్రవేశపెట్టిన తక్కువ సమయంలోనే ఈ యాప్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు సుమారు రెండున్నర లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా.. ఆరు లక్షలకుపైగా సేవలను బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.4కోట్ల లావాదేవీలు..
సుమారు రూ.4 కోట్ల విలువైన లావాదేవీలు సురక్షితంగా పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 219 ప్రదేశాల్లో ఈ యాప్ ద్వారా ఎంట్రీ టికెట్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. ‘టికెట్ ఏదైనా.. యాప్ ఒక్కటే’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ యాప్‌ను మరింత విస్తరించనున్నట్లు సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. వివిధ ప్రభుత్వ సేవలను పౌరుల రోజువారీ జీవితంలో భాగం చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎక్కడికైనా వెళ్లే ముందు క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ముందుగానే మీ టికెట్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని మీ సేవ కమిషనర్ టీ రవి కిరణ్ వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



