త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Python Jodie Foster | కొండ చిలువ‌కు క్యాన్స‌ర్ చికిత్స‌.. ప్ర‌పంచంలోనే ఇది తొలిసారి

Python Jodie Foster | క్యాన్స‌ర్ చికిత్స‌లు మ‌నుషుల‌కు అందించిన ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. కానీ అదే క్యాన్స‌ర్ చికిత్స ఓ కొండ‌చిలువ‌కు అందించ‌డం ప్ర‌పంచంలోనే ప్ర‌థ‌మం. ఈ అరుదైన ఘ‌ట‌న బ్రిట‌న్‌లోని చెస్ట‌ర్ జూ పార్కులో వెలుగు చూసింది.

S

International | Published On Aug 23, 2026, 8.34 pm IST

Python Jodie Foster | కొండ చిలువ‌కు క్యాన్స‌ర్ చికిత్స‌.. ప్ర‌పంచంలోనే ఇది తొలిసారి
Advertisement

Python Jodie Foster | త్రినేత్ర‌.న్యూస్ : క్యాన్స‌ర్ చికిత్స‌లు మ‌నుషుల‌కు అందించిన ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. కానీ అదే క్యాన్స‌ర్ చికిత్స ఓ కొండ‌చిలువ‌కు అందించ‌డం ప్ర‌పంచంలోనే ప్ర‌థ‌మం. ఈ అరుదైన ఘ‌ట‌న బ్రిట‌న్‌లోని చెస్ట‌ర్ జూ పార్కులో వెలుగు చూసింది. అత్యంత సంక్లిష్ట‌మైన క్యాన్స‌ర్ చికిత్స‌ను కొండ‌చిలువ‌కు అందించి, దాన్ని ప్రాణాల‌తో కాపాడారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

జోడీ ఫోస్ట‌ర్ అనే 15 అడుగుల రెటిక్యులేటెడ్ పైథాన్ వ‌య‌సు 23 ఏండ్లు. అయితే కొండ‌చిలువ ద‌వ‌డ ఎముక‌పై క‌ణితి ఏర్ప‌డింది. ఆ క‌ణితిని వెట‌ర్న‌రీ డాక్ట‌ర్లు ప‌రిశీలించి.. దాన్ని క్యాన్స‌ర్ ట్యూమ‌ర్‌గా నిర్ధారించారు. ఈ కార‌ణంగా పైథాన్ ఆహారం తీసుకోలేక తీవ్రంగా ఇబ్బంది ప‌డింద‌ని తేల్చారు.

2024లోనే ఒక క‌ణితిని తొల‌గించారు..

అయితే కొండ‌చిలువ ద‌వ‌డ ఎముక‌పై 2024లోనే ఒక క‌ణితి ఏర్ప‌డ‌గా, దాన్ని అప్ప‌ట్లోనే తొల‌గించేశారు. మ‌ళ్లీ అది ఆ ఎముక చుట్టూ క‌ణితి ఏర్ప‌డింది.. సర్జ‌రీతోనే న‌యం చేయ‌డం కుద‌ర‌ద‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే మ‌నుషుల‌కు నిర్వ‌హించే ఎల‌క్ట్రో కీమోథెర‌ఫీ విధానాన్ని కొండ‌చిలువ‌కు ఉప‌యోగించాల‌ని వెట‌ర్న‌రీ వైద్యులు నిర్ణ‌యించారు.

90 నిమిషాల పాటు ఆప‌రేష‌న్..

క్యాన్స‌ర్ నిపుణుల సాయంతో పైథాన్‌కు ఎల‌క్ట్రో కీమోథెర‌పీ ఉప‌యోగించారు. బ్లియోమైసిన్ అనే కీమోథెర‌పీ డ్ర‌గ్‌ను అందించారు. మొత్తానికి 90 నిమిషాల పాటు శ‌స్త్ర‌చికిత్స నిర్వ‌హించి, ద‌వ‌డ ఎముక‌లోని కొంత భాగంతో పాటు మిగిలిన క్యాన్స‌ర్ క‌ణాల‌ను పూర్తిగా తొల‌గించేశారు వైద్యులు.

కోలుకున్న కొండ‌చిలువ‌

ప్ర‌స్తుతం కొండ‌చిలువ కోలుకుంటుంద‌ని ప‌శు వైద్యులు తెలిపారు. ఇప్పుడు సులువుగా ఆహారాన్ని తిన‌గ‌లుగుతుంద‌ని పేర్కొన్నారు. ఒక కోడిని సునాయాసంగా మింగేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆరోగ్యంగా ఉండ‌డంతో చెస్ట‌ర్ జూ సిబ్బంది సంతోషం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement