Medaram Jatara | మేడారం జాతరకు వెళ్తున్నారా..? మీ పిల్లల చేతికి క్యూఆర్ కోడ్ బ్యాండ్ వేయించడం మరవొద్దు..!
Medaram Jatara | తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన జాతరకు యావత్ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో భక్తుల భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ పోలీసుశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.
Medaram Jatara | తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన జాతరకు యావత్ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో భక్తుల భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ పోలీసుశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.
వాస్తవానికి జాతరలో పిల్లలు తప్పిపోయే దృశ్యాలు చూస్తూనే ఉంటాం. ఎవరైనా పిల్లలు తప్పిపోయిన క్షణంలో వేగంగా గుర్తించేందుకు పోలీస్ అధికారులు చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. జియో ట్యాగింగ్ బేస్డ్ సీటీఎంఎస్ విధానంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన సెష్పల్ రిస్ట్ బ్యాండ్‌లను పిల్లల చేతికి కడుతున్నారు. దాంతో తప్పిపోయిన వారిని వేగంగా గుర్తించి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరే అవకాశం ఉంటుందని పోలీసులు అధికారులు పేర్కొంటున్నారు.
జాతర మార్గంలో 11 ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. పిల్లలు ఎవరైనా తప్పిపోయిన సమయంలో వారి చేతికి ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే తల్లిదండ్రుల వివరాలు కనిపిస్తాయని డీజీపీ తెలిపారు. ఎవరైనా జాతర పిల్లలు తప్పిపోయిన సమయంలో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే తల్లిదండ్రుల వివరాలు కనిపిస్తాయని.. కింద కనిపించే ఫోన్ నంబర్‌కైనా సమాచారం ఇవ్వొచ్చని లేదంటే.. పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇవ్వొచ్చన్నారు.
ఈ క్యూఆర్ కోడ్‌లో వివరాలు తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో కనిపించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. జియో ట్యాగింగ్ బేస్డ్ సీటీఎం వ్యవస్థ అమలుకు వొడాఫోన్-ఐడియా సహకారం అందించింది. జియోట్యాగ్ ఆధారిత మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఆ సంస్థ అభివృద్ధి చేసింది. మేడారం జాతరకు వెళ్లే మార్గం, బస్టాండ్లు సహా 11 చోట్ల ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్లలో పిల్లలు బ్యాండ్స్‌ను కడుతున్నారు. ఇదిలా ఉండగా వొడాఫోన్–ఐడియా సహకారంతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ సుమతి నెలన్నర పాటు శ్రమించి ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థను రూపొందించారు. మహిళా భద్రతా విభాగం డీజీపీ చారుసిన్హా ఆధ్వర్యంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
#medaramjathara లో తప్పిపోయే పిల్లల ఆచూకీని గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ తో కూడిన రిస్ట్ బ్యాండ్ తీసుకురావడం జరిగింది. 11 ప్రాంతాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా చిన్నారులు తప్పిపోయి కనిపిస్తే వారి చేతికున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తల్లిదండ్రుల వివరాలు కనిపిస్తాయి. pic.twitter.com/qFaTvV6l7s
— Telangana Police (@TelanganaCOPs) January 28, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





