Mandakrishna Madiga | మాదిగలను రాజకీయంగా అణిచివేస్తున్న రేవంత్ సర్కార్ : మందకృష్ణ మాదిగ
Mandakrishna Madiga | రేవంత్ సర్కార్ మాదిగలను రాజకీయంగా అణిచివేస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. రాజ్యసభకు మాదిగలను ఒక్కరిని కూడా ఎంపిక చేయకుండా మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
లోక్‌సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేదు..
రాజ్యసభకు సైతం ఎంపిక చేయకపోవడం బాధాకరం
ఉమ్మడి ఏపీలోనే మాదిగలకు న్యాయం..
వర్గీకరణ విషయంలోనూ మాదిగలకు అన్యాయం
మాదిగల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే బెటర్
Mandakrishna Madiga | త్రినేత్ర.న్యూస్ : రేవంత్ సర్కార్ మాదిగలను రాజకీయంగా అణిచివేస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. రాజ్యసభకు మాదిగలను ఒక్కరిని కూడా ఎంపిక చేయకుండా మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. లోక్‌సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేదు.. ప్రస్తుతం రాజ్యసభకు సైతం మాదిగలను ఎంపిక చేయకపోవడం బాధాకరమన్నారు.
తన రాజకీయ జీవితంలో మాదిగలు అన్ని వేళలా అండగా ఉన్నారని చెబుతున్న రేవంత్ మాదిగలను రాజకీయంగా అణిచివేస్తున్నారు. మాదిగలను మభ్యపెట్టి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేతకు గురిచేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలకు లోక్‌సభ, రాజ్యసభలలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్‌లో వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసినట్లు వార్తలు రావడం తమకు బాధ కలిగించాయి. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తన సహజత్వాన్ని చాటుకుందని మరోసారి నిరూపితమైంది. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటపై నిలబడలేదు. గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు 9 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించి అన్యాయం చేశారు.. మాలల ఒత్తిడికి తలొగ్గి రేవంత్ ఇదంతా చేస్తున్నారని మందకృష్ణ మండిపడ్డారు.
ఇటీవల కోదాడలో లాకప్‌డెత్‌లో మాదిగ బిడ్డ కర్ల రాజేష్ చనిపోవడంలో పోలీసుల పాత్ర ఉంది.. చిత్రహింసలకు గురిచేసి చంపారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణం. ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడడం కోసం ఇదంతా చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాగే మరియమ్మ లాకప్ డెత్ జరిగితే పోలీసులను వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని మందకృష్ణ గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



