Suicide attempt at Bheemgal PS | భీమ్‌గల్ పీఎస్‌లో నిప్పంటించుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే
Suicide attempt at Bheemgal PS | నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పీఎస్‌లో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. హోటల్ నడుపుకునే సుధాకర్ అనే వ్యక్తి.. తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
Suicide attempt at Bheemgal PS | త్రినేత్ర న్యూస్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పీఎస్‌లో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. హోటల్ నడుపుకునే సుధాకర్ అనే వ్యక్తి.. తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని హుటాహుటిన ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వేధింపులతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అతడి కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
భీమ్‌గల్ పట్టణంలో పొలాస సుధాకర్ హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రాత్రి 10.00 గంటల తర్వాత హోటల్‌లోని టేబుళ్లు బయట రహదారి పక్కన పెట్టాడు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు.. రహదారిపై ఆ టేబుళ్లు తీయాలని సుధాకర్‌కు సూచించారు. అతడు కాస్తా ముక్తసరిగా సమాధానం ఇవ్వడంతో ఆ టేబుళ్లను అక్కడి నుంచి పోలీసులు తరలించారు. టేబుళ్లను తీసుకెళ్లద్దంటూ సుధాకర్ బతిమిలాడాడు.
అయినప్పటికీ వాటిని తీసుకెళ్లడంతో పాటు సుధాకర్‌పై ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేశారు. ఇక సోమవారం కోర్టుకు వెళ్లాలంటూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. దీంతో సుధాకర్ తీవ్ర మనస్తాపానికి గురై వెంట తెచ్చుకున్న పెట్రోల్ తన ఒంటిపై పోసుకుని నిప్పింటించుకున్నాడు. మంటల్లో ఉన్న సుధాకర్‌పై స్థానికంగా ఉన్నవారు ఇసుక చల్లి, అందుబాటులో ఉన్న మ్యాట్‌లతో మంటలను అదుపు చేశారు. అయినా అతడికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా మారడంతో ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అంతకుముందు సుధాకర్ మాట్లాడుతూ లేట్‌నైట్ వరకు హోటల్ నడుపుతున్నారంటూ పోలీసులు పలుమార్లు ప్రశ్నించి, జరిమానాలు విధించినట్లు ఆయన ఆరోపించారు. ఇప్పటికే తనపై మూడుసార్లు ఫైన్ విధించారని సుధాకర్ తెలిపారు. తాజాగా జరిమానా విధించిన పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి రావాలని ఆదేశించినట్లు చెప్పారు. తాను చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. మిగతా షాపులు నడిపిస్తున్న వాళ్లను వదిలేసి కేవలం వ్యక్తిగతంగా తననే టార్గెట్ చేసి పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు చెప్తున్నాడు.
పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా..
వేధింపులకు పాల్పడ్డ ఎస్సై కానిస్టేబుల్ తిరుపతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భీంగల్ పోలీస్ స్టేషన్ ముందు సుధాకర్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ధర్నాకు దిగారు. బాధితుడికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. బాధితుడి ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?
అక్టోబర్ 5, 2026

Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
అక్టోబర్ 5, 2026

Tammineni Veerabhadram | రేవంత్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం భ్రమ: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Priyadarshi | కేసీఆర్‌గా ప్రియదర్శి - మేకోవర్ వీడియో రిలీజ్
- ●OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..
- ●IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..
- ●Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?
- ●CEC Gyanesh Kumar | జ్ఞానేశ్‌ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్

Priyadarshi | కేసీఆర్‌గా ప్రియదర్శి - మేకోవర్ వీడియో రిలీజ్

OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..

IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..

Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?



