OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..
OPPO F35 | మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్లు ఎఫ్35 5జి, ఎఫ్35 ప్రొ 5జి ఫోన్లను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఒప్పోకు చెందిన ఎఫ్ సిరీస్ ఫోన్లకు 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ స్పెషల్ సిరీస్‌ను లాంచ్ చేసినట్లు ఒప్పో తెలిపింది. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లలో పవర్‌ఫుల్ కెమెరాలు, భారీ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లను అందించారు.
Technology | Published On Oct 5, 2026, 2.28 pm IST
OPPO F35 | మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్లు ఎఫ్35 5జి, ఎఫ్35 ప్రొ 5జి ఫోన్లను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఒప్పోకు చెందిన ఎఫ్ సిరీస్ ఫోన్లకు 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ స్పెషల్ సిరీస్‌ను లాంచ్ చేసినట్లు ఒప్పో తెలిపింది. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లలో పవర్‌ఫుల్ కెమెరాలు, భారీ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లను అందించారు. రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సల్ ముందు కెమెరా ఉంది. ఇది 100 డిగ్రీల వైడ్ యాంగిల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో వస్తుంది. ఒకేసారి ఎక్కువ మందితో సెల్ఫీలు తీసుకునేందుకు 0.6ఎక్స్ వైడ్ వ్యూ, ఏఐ ఆటో వైడ్ యాంగిల్ స్విచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు కెమెరాలో ఆటో ఫోకస్ కూడా ఉంది. ఒప్పో ఎఫ్35 ప్రొ 5జిలో 50 మెగాపిక్సల్ ప్రధాన వెనుక కెమెరాతోపాటు 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. ప్రధాన కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. నేచురల్ టోన్ 2.0, మెరుగైన పోర్ట్రెయిట్ మోడ్, అల్ట్రా బ్రైట్ డ్యుయల్ రియర్ ఫ్లాష్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు, వెనుక కెమెరాలతో 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అల్ట్రా స్టెడీ, డ్యుయల్ వ్యూ వీడియో మోడ్‌లు కూడా ఉన్నాయి.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే, కెమెరాలు..
ఒప్పో ఎఫ్35లో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. ఇందులో ట్రూ టోన్ ఆప్టిమైజేషన్ అందించారు. ముందు, వెనుక కెమెరాలతో గరిష్ఠంగా 2.5కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఒప్పో ఎఫ్35 ప్రొ 5జికి 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ ప్రాసెసర్‌ను అమర్చారు. గత తరంతో పోలిస్తే సీపీయూ మల్టీ-కోర్ పనితీరు 30 శాతం, జీపీయూ పనితీరు 35 శాతం పెరిగినట్లు కంపెనీ చెబుతోంది. ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించినప్పుడు వేడిని నియంత్రించేందుకు 5,000 చదరపు మిల్లీమీటర్ల సూపర్‌కూల్ వేపర్ ఛాంబర్ ఇచ్చారు. ఈ మోడల్‌లో 6.78 ఇంచుల 1.5కె అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ ఫుల్ స్క్రీన్ బ్రైట్‌నెస్, గరిష్ఠంగా 3,600 నిట్స్ బ్రైట్‌నెస్, 2,160 హెడ్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారీ బ్యాటరీ..
ఒప్పో ఎఫ్35లో 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఇందులో 6.57 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 120 హెడ్జ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. 1,400 నిట్స్ వరకు ఫుల్ స్క్రీన్ బ్రైట్‌నెస్, 10 బిట్ కలర్ డెప్త్, 60, 90, 120 హెడ్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 80 వాట్ల సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంటుంది. 1,800 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ 80 శాతానికి పైగా సామర్థ్యాన్ని నిలుపుకుంటుందని ఒప్పో తెలిపింది. కంపెనీ అంచనా ప్రకారం బ్యాటరీని సుమారు ఆరు సంవత్సరాల పాటు ఉపయోగించుకునేలా రూపొందించారు. నీరు, దుమ్ము నుంచి రక్షణ విషయంలోనూ ఈ ఫోన్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎఫ్35లో ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కె రేటింగ్‌లు ఉన్నాయి. ఎఫ్35 ప్రొలో ఐపీ68, ఐపీ69, ఐపీ69కె రేటింగ్‌లు ఉన్నాయి. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్‌తోపాటు వర్షంలోనూ టచ్‌స్క్రీన్ పనిచేసేలా రెయిన్‌స్టార్మ్ టచ్ ఫీచర్ ఇచ్చారు.
ఏఐ ఫీచర్లు సైతం..
ఎఫ్35లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16.0, ఎఫ్35 ప్రొ లో ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 16.5 అందిస్తున్నారు. ఏఐ రికార్డింగ్, ఏఐ అల్ట్రా క్లియర్ డాక్యుమెంట్స్, ఏఐ కాల్ గార్డ్, వన్ ట్యాప్ సెక్యూరిటీ గార్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ట్రినిటీ ఇంజిన్ ద్వారా సమాంతర లోడింగ్, అడాప్టివ్ షెడ్యూలింగ్ నిర్వహించవచ్చు. ఎఫ్35 ప్రొ లో లూమినస్ రెండరింగ్ ఇంజిన్ కూడా ఉంది. ఎఫ్35లో 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఎఫ్35 ప్రొ లో 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ఆప్షన్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 5జి, 4జీ వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్ వంటి సదుపాయాలు ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ స్టీరియో స్పీకర్లు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ ఉన్నాయి.

ధర ఎంత..
ఒప్పో ఎఫ్35 సిరీస్ విక్రయాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఒప్పో ఎఫ్35 ప్రొ 5జి 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.45,999 ఉండగా, 8జీబీ, 128జీబీ మోడల్ రూ.49,999గా ఉంది. 8జీబీ, 256జీబీ వేరియంట్ ధరను రూ.54,999గా నిర్ణయించారు. సన్‌రైజ్ ఆరెంజ్, వేవ్ బ్లూ, ట్విలైట్ బ్రౌన్ రంగుల్లో ఇది లభిస్తుంది. ఒప్పో ఎఫ్35 5జి 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.38,999గా ఉంది. 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.42,999గా ఉంది. వేవ్ బ్లూ, టైటానియం గ్రే, మిస్ట్ పింక్ రంగుల్లో ఫోన్ లభిస్తుంది.
లాంచ్ ఆఫర్లు..
లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎఫ్35 ప్రొ పై 18 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ సదుపాయం, 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నారు. ఒప్పో ఎన్‌కో బడ్స్ 3 ప్రొ ప్లస్‌పై 50 శాతం డిస్కౌంట్ కూడా ఉంది. అదనంగా ఒక సంవత్సరం ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉచితంగా, ఒక సంవత్సరం ఎస్‌డీపీ, ఏడీఎల్‌డీపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఎఫ్35 మోడల్‌పై 15 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్, 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఎన్‌కో బడ్స్ 3 ప్రొ ప్లస్‌పై 50 శాతం డిస్కౌంట్, ఒక సంవత్సరం ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉచితంగా లభిస్తాయి. ఈ అదనపు వారంటీ, ఎస్‌డీపీ, ఏడీఎల్‌డీ ఆఫర్లు అక్టోబర్ 21 వరకు అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
- ●IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..
- ●Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?
- ●CEC Gyanesh Kumar | జ్ఞానేశ్‌ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
- ●Maruti Suzuki | మారుతి షేర్లకు భారీ కరెక్షన్.. 34 శాతం పతనం తర్వాత మళ్లీ పుంజుకుంటుందా?
- ●Supreme Court | నేరస్థుల్లో భయం పుట్టించాలి.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..

Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?

CEC Gyanesh Kumar | జ్ఞానేశ్‌ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్



