త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | ముక్కు నెలకు రాసి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి

Mahesh Kumar Goud | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ‌ర్నాచౌక్‌లో ముక్కు నేల‌కురాసి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గాంధీ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌కు ఆయ‌న జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

P

Telangana | Published On Jul 24, 2026, 3.51 pm IST

Mahesh Kumar Goud | ముక్కు నెలకు రాసి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి
Advertisement
  • ధ‌ర్నా చౌక్‌ను ఎత్తేసిన చ‌రిత్ర బీఆర్ఎస్‌దే
  • ధ‌ర్నా చేసే హ‌క్కు కేటీఆర్‌కు ఎక్క‌డిది?
  • కేసీఆర్ ఎందుకు ఢిల్లీ వెళ్ల‌లేదు
  • బీఆర్‌ఎస్ పాపాల చిట్టా పెద్దది
  • ఆ పార్టీ డ్రామాలో విద్యార్థులు భాగం కావొద్దు
  • టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్‌గౌడ్‌

Mahesh Kumar Goud | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ‌ర్నాచౌక్‌లో ముక్కు నేల‌కురాసి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గాంధీ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌కు ఆయ‌న జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ధర్నా చౌక్ ఎత్తేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీద‌ని, ధర్నా చేసే హక్కు కేటీఆర్‌కు ఎక్క‌డిద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ధర్నాచౌక్‌లో ఏ విధంగా ధ‌ర్నా చేస్తున్నారో బీఆర్ఎస్ నేత అర్థం చేసుకోవాల‌న్నారు. ఈ వ‌య‌సులోనూ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే విద్యార్థుల ప‌క్షాన పోరాడుతున్నార‌ని.. మీ కేసీఆర్ ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ల‌లేద‌ని నిల‌దీశారు. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగ‌ల్‌లో నిర‌స‌న‌లో పాల్గొన్నార‌ని తెలిపారు.

బీఆర్ ఎస్ పాపాల చిట్టా పెద్దద‌ని, గ్లోబారిన సంస్థ ఆ నాడు ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణం అయ్యింద‌ని ఆరోపించారు. 20పైగా విద్యార్థులు ప్రాణాలు పోవడానికి గ్లోబరిన సంస్థ కారణం కాదా? అని ప్ర‌శ్‌నించారు. ఆ సంస్థ రిపోర్టును బీఆర్ఎస్ ఎందుకు బయటపెట్టలేదని నిల‌దీశారు. గ్లోబరిన సంస్థ పేరు మార్చుకొని విధ్యార్ధుల జీవితంతో ఆటలు ఆడుతోంద‌ని, అందులో కేటీఆర్ హ‌స్తం ఉంద‌ని అనుమానాలున్నాయ‌న్నారు. బీఆర్ఎస్ హయాంలో లీకుల పర్వం సాగింద‌న్నారు. రూ.1400కోట్లు బీఆర్ఎస్ ఖాతాలో మూలుగుతున్నాయ‌ని.. అందులో నుంచి చ‌నిపోయిన విద్యార్థుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. మే 12 నీట్ పరీక్ష లీక్ అయితే కేటీఆర్ ఇప్పుడు మొద్దు నిద్ర లేచాడ‌ని, రాహుల్ గాంధీకి మైలేజ్ వస్తుందని మోదీతో కుట్ర పన్ని కేటీఆర్ బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నార‌న్నారు.

బీఆర్ఎస్ డ్రామాలో విద్యార్థులు భాగం కావొద్దని మ‌హేశ్‌కుమార్ గౌడ్ విజ్ఞ‌ప్తి చేశారు. బీఆర్ఎస్ హయంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేద‌ని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు సైతం లీకుల పర్వం సాగింద‌ని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కి కర్ర కాల్చి వాత పెట్టార‌ని, సున్నా సీట్లకు పరిమితం చేశార‌న్నారు. విద్యార్థులకు న్యాయం కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నార‌ని.. మొద్దు నిద్రలేచి నల్ల చొక్కాలు వేసుకొని ధర్నా అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ చుర‌క‌లంటించారు.

Advertisement
Advertisement