NRI News | మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ఏర్పాట్లను సమీక్షించిన మహేశ్ బిగాల
NRI News | మలేషియాలో జూన్ 6న నిర్వహించనునన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన సన్నాహకాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ (BRS) ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల మలేషియా చేరుకున్నారు.
NRI News | మలేషియాలో జూన్ 6న నిర్వహించనునన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన సన్నాహకాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ (BRS) ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల మలేషియా చేరుకున్నారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. మలేషియాలోని ‘మాట్రేడ్’ (MATRADE) ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. బీఆర్ఎస్ మలేషియా, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
వేడుకల వేదికను పరిశీలించిన ఆయన.. కన్వెన్షన్ సెంటర్‌లోని మౌలిక సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యాలు, వేదిక ఏర్పాట్లు సహా అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహణ కమిటీతో సమావేశమై ఇప్పటివరకు చేసిన ఏర్పాట్ల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ మలేషియా, మైటా ప్రతినిధులు టీ మారుతి కూర్మ, తిరుపతి, సందీప్ గౌడ్, నరేందర్ రెడ్డి, అనిల్, జ్యోతి, మోనా, పూర్ణచందర్ రావు, దీపికతో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తుది ఏర్పాట్లపై ఆయన పలు సూచనలు చేస్తూ, ఇప్పటివరకు చేపట్టిన పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు నిర్వాహక వర్గాలు తెలిపాయి. 2025లో డల్లాస్‌లో నిర్వహించిన భారీ వేడుకల తర్వాత, విదేశాల్లో జరుగుతున్న రెండో అతిపెద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకగా మలేషియా కార్యక్రమం నిలవనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, సాంస్కృతిక వైభవం, అభివృద్ధి విజయాలను ప్రపంచ వేదికపై చాటిచెప్పేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ప్రవాస తెలంగాణవాసులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ex Minister Laxma Reddy | కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ఆగస్టు 10, 2026

Protest | ఎస్సీ హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు.. జంతర్ మంతర్లో దళిత క్రైస్తవుల ధర్నా..
ఆగస్టు 10, 2026

Malaysia Telangana Association | ఖండాంతరాలు దాటిన తెలంగాణ సంస్కృతి: మలేషియాలో మార్మోగిన ‘బోనాలు 2026’ సంబురాలు
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Indiramma Indlu Towers | గుడ్ న్యూస్: 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' అప్లికేషన్ గడువు పెంపు
- ●Singireddy Niranjan Reddy | ఆంధ్రజ్యోతిది ఆది నుంచీ 'చావు భాషే'
- ●RTI on Telangana Housing | ఆర్టీఐతో బయటపడ్డ పక్కా లెక్కలు: తెలంగాణలో డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్ ఇదే!
- ●Anchor Charmila | యాంకర్ చర్మిలా కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●OTT | ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్ - ప్రేమకు కులం అడ్డుగా నిలిస్తే!
- ●Ex Minister Laxma Reddy | కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Indiramma Indlu Towers | గుడ్ న్యూస్: 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' అప్లికేషన్ గడువు పెంపు

Singireddy Niranjan Reddy | ఆంధ్రజ్యోతిది ఆది నుంచీ 'చావు భాషే'

RTI on Telangana Housing | ఆర్టీఐతో బయటపడ్డ పక్కా లెక్కలు: తెలంగాణలో డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్ ఇదే!

Anchor Charmila | యాంకర్ చర్మిలా కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!



