త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahalakshmi Cards | మ‌హిళ‌ల‌కు ఉచిత బస్ ప్రయాణం.. జూన్ 2 నుంచి మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డులు

Mahalaxmi Cards | మ‌హిళా సాధికార‌తే ధ్యేయంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణ (Free Bus For Women) సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ది. ప్ర‌స్తుతం ఆధార్ కార్డులు చూపించి మ‌హిళ‌లు బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్నారు.

G

Telangana | Published On May 29, 2026, 7.55 am IST

Mahalakshmi Cards | మ‌హిళ‌ల‌కు ఉచిత బస్ ప్రయాణం.. జూన్ 2 నుంచి మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డులు
Advertisement

Mahalakshmi Cards | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హిళా సాధికార‌తే ధ్యేయంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణ (Free Bus For Women) సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ది. ప్ర‌స్తుతం ఆధార్ కార్డులు చూపించి మ‌హిళ‌లు బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్నారు. దీనిని మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా జూన్ 2న మ‌హాల‌క్ష్మి స్మార్ట్ కార్డుల‌ను (Mahalakshmi Cards) అందించ‌నుంది. పైలట్ ప్రాజెక్టుగా తొలుత‌ ప్రతి జిల్లాలో ఒక మండలంలో కార్డుల‌ను జారీ చేస్తారు. మొద‌టి ద‌శ‌లో 5 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు స్మార్ట్‌కార్డుల‌ను పంపిణీ చేయ‌నున్నారు. పైలట్ ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలను,ప్రాక్టికల్ ఇబ్బందులను పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కార్డుల జారీ ప్రక్రియను చేపడతారు. కార్డులు వచ్చే వరకు మహిళలు ఆధార్‌తోనే ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఈ కార్డు కేవలం సాధారణ కార్డులా కాకుండా లోపల చిప్ అమర్చి ఉంచుతారు. ప్రయాణికుల డేటాకు ఇబ్బంది రాకుండా, రీడింగ్ మెషీన్ల ద్వారా తక్షణమే వెరిఫికేషన్ అయ్యేలా చూస్తున్నారు. ఈ కార్డులను మీ సేవ, బస్ పాస్ కౌంటర్లలో రూ.50 చెల్లించి తీసుకోవాలని అధికారులు తెలిపారు. కాగా, స్మార్ట్ కార్డుల త‌యారీ ఆర్టీసీకి ఆర్థిక వ్యయంతో కూడుకున్న ప‌ని కావ‌డంతో ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది.

Advertisement
Advertisement