త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fuel Panic | పెట్రోల్, డీజిల్ సరఫరా 126శాతం పెంచినా.. బంకుల వద్ద తగ్గని రద్దీ

Fuel Panic | రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ కోసం బంకుల వ‌ద్ద ర‌ద్దీ కొన‌సాగుతూనే (Fuel Panic) ఉంది. బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచి వాహ‌న‌దారులు బంద‌కు వ‌ద్ద‌ బారులు తీరారు.

G

Telangana | Published On Apr 29, 2026, 10.57 am IST

Fuel Panic | పెట్రోల్, డీజిల్ సరఫరా 126శాతం పెంచినా.. బంకుల వద్ద తగ్గని రద్దీ
Advertisement

Fuel Panic | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ కోసం బంకుల వ‌ద్ద ర‌ద్దీ కొన‌సాగుతూనే (Fuel Panic) ఉంది. బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచి వాహ‌న‌దారులు బంద‌కు వ‌ద్ద‌ బారులు తీరారు. పెట్రోల్‌, డీజిల్ (Petrol Diesel) స‌ర‌ఫరాను 126 శాతం పెంచిన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ వాహ‌నదారుల్లో ఆందోళ‌న ఏమాత్రం త‌గ్గ‌లేదు. రోడ్లపై పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు (No Stock Boards) క‌నిపిస్తుండ‌టంతో వాహనదారుల్లో అనుమానాలు అధిక‌మ‌వుతున్నాయి.

ప్ర‌జ‌లు త‌మ వాహ‌నాల‌తోపాటు డ‌బ్బాలు, క్యాన్ల‌లో పెట్రోల్‌, డీజీల్ తీసుకుపోతుండ‌టంతో.. చమురు కంపెనీలు రోజువారీ సగటు కంటే సరఫరాను భారీగా పెంచినప్పటికీ స్టాక్ అంతా అయిపోతున్న‌ది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద కొద్ది గంటల్లోనే ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టే పరిస్థితి నెలకొన్న‌ది. కాగా, సోష‌ల్ మీడియా వ‌దంతుల‌తోపాటు ఇంధన పంపిణీ పెరగడానికి కారణాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పరిశ్రమలకు ఉపయోగించే డీజిల్ ధర ఇటీవల లీటరుకు రూ.150కు పెరగడంతో, తక్కువ ధరకు లభించే సాధారణ పెట్రోల్ బంకుల వైపు పెద్ద వినియోగదారులు మొగ్గుచూపారు. దీంతో బంకుల వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

అదేవిధంగా పొరుగు రాష్ట్రాల్లో సరఫరా సమస్యలు తలెత్తడంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ప్రజలు తెలంగాణ బంకులకు పెద్ద సంఖ్యలో రావడం కూడా డిమాండ్ పెరగడానికి కారణమైంది.

 

Advertisement
Advertisement