త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adluri Laxman | తెగిప‌డిన లిఫ్ట్‌.. మంత్రి అడ్లూరికి త‌ప్పిన పెను ప్ర‌మాదం

Adluri Laxman | రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. జ‌గిత్యాల‌(Jagtial) లో లిఫ్ట్ తెగిప‌డిన ఘ‌ట‌న‌లో ఆయ‌న క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

S

Telangana | Published On Oct 11, 2026, 3.42 pm IST

Adluri Laxman | తెగిప‌డిన లిఫ్ట్‌.. మంత్రి అడ్లూరికి త‌ప్పిన పెను ప్ర‌మాదం
Advertisement

Adluri Laxman | త్రినేత్ర న్యూస్: రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. జ‌గిత్యాల‌(Jagtial) లో లిఫ్ట్ తెగిప‌డిన ఘ‌ట‌న‌లో ఆయ‌న క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. లిఫ్టులో మంత్రితో పాటు ఎక్కువ మంది ఉండ‌డంతో తెగిప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఓ కార్య‌క‌ర్త‌ల‌కు స్వ‌ల్పంగా గాయాలైన‌ట్లు స‌మాచారం.

వివ‌రాల్లోకి వెళ్తే.. జగిత్యాల అర్బన్ మండలం దరూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ బ్యాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి మంత్రి ఆదివారం హాజరయ్యారు. మొదట మంత్రి లిఫ్ట్‌లో సెకండ్ ఫ్లోర్‌కి వెళ్లారు. ఆ తర్వాత స్థానిక కాంగ్రెస్ నాయకులు సైతం అదే లిఫ్ట్ ఎక్కారు. ఈ క్రమంలో పైకి వెళ్లిన లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో కాంగ్రెస్ నేత ముఖేష్ కన్నా కాలికి గాయం కాగా మరి కొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. లిఫ్ట్‌లో సుమారు 8 మంది ఉన్న‌ట్లు చెబుతున్నారు.

కాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు గతంలోనూ పలు సందర్భాల్లో ప్రమాదాల బారిన ప‌డ్డారు. వెల్గటూర్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడి గాయపడ్డారు. మంత్రి అయ్యాక కోరుట్ల పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూజర్ కారు టైరు ఊడిపోగా ఈ ప్రమాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. కొన్ని నెలల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో లిఫ్ట్ వైర్లు తెగిన ఘటనలోనూ తృటిలో త‌ప్పించుకోగా తాజాగా లిఫ్ట్ ప్రమాదం నుంచి మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డారు.

Advertisement
Advertisement