త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | గోయ్ రాఖోన్న్ యాత్ర.. గోవా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy | గోవాలో జరుగుతున్న గోయ్ రాఖోన్న్ యాత్రలో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం గోవా బ‌య‌లుదేరి వెళ్లారు.

S

Telangana | Published On Oct 11, 2026, 2.49 pm IST

Revanth Reddy | గోయ్ రాఖోన్న్ యాత్ర.. గోవా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర న్యూస్: గోవాలో జరుగుతున్న గోయ్ రాఖోన్న్ యాత్రలో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం గోవా బ‌య‌లుదేరి వెళ్లారు. గోవా భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపును కాపాడుకోవడం కోసం సాగుతున్న యాత్ర‌లో సాయంత్రం ఆయ‌న పాలుపంచుకోనున్నారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత నెల 22న పనాజీలో ప్రారంభమైన ఈ యాత్ర 27 రోజుల పాటు కొన‌సాగ‌నుంది.

ఇందులో భాగంగా చీఫ్టెన్స్ స్మారకం నుంచి కున్కోలిమ్ బస్టాండ్ వరకు సాగే పాదయాత్రలో రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మాట్లాడ‌నున్నారు. స‌భ ముగిసిన త‌ర్వాత‌ రాత్రి గోవా నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.

కాగా ఈ యాత్ర 27 రోజుల పాటు 40 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈనెల‌ 18న ముగియనున్న‌ది. అధికార బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు యాత్ర నిర్వహిస్తున్నట్లు గోవా కాంగ్రెస్ విభాగం తెలిపింది.

Advertisement
Advertisement