Green India Challenge-Maharashtra | ఊరూరికో జమ్మి చెట్టు.. మహారాష్ట్రలోనూ శ్రీకారం
Green India Challenge-Maharashtra | తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టును ప్రతి గ్రామం, ప్రతి ఆలయంలో నాటే “ఊరూరికో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు” కార్యక్రమానికి మహారాష్ట్రలోనూ శ్రీకారం చుట్టారు.
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటా శమీ వృక్షాల పెంపకం
Green India Challenge-Maharashtra | త్రినేత్ర న్యూస్: తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టును ప్రతి గ్రామం, ప్రతి ఆలయంలో నాటే “ఊరూరికో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు” కార్యక్రమానికి మహారాష్ట్రలోనూ శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం, దేవాలయం, మఠం, ఇంటింటా జమ్మి చెట్లు నాటనున్నారు. నవరాత్రి శుభ ముహూర్తం సందర్భంగా సోనెపేట్‌లోని నందికేశ్వర మఠంలో మహారాష్ట్ర వీరశైవ లింగాయత శివాచార్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నందికేశ్వర శివాచార్య మహారాజ్ చేతుల మీదుగా ఈ రాష్ట్రవ్యాప్త వృక్షారోపణ మోహింను ఆదివారం ప్రారంభించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జే సంతోశ్ కుమార్ నాయకత్వంలో నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా, ధార్మిక, సాంస్కృతిక, పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన శమీ (జమ్మి) వృక్షాన్ని మహారాష్ట్రలో ప్రతి ఇంటా నాటే రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరో సంవత్సరంగా కొనసాగిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడు మహారాష్ట్రలోనూ శమీ వృక్ష పరిరక్షణను విస్తరించడం విశేషం.
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహారాష్ట్ర సమన్వయకర్త సుధీర్ బిందు, ప్రధానోపాధ్యాయులు మాణిక్ నిలాంగే, ప్రదీప్ గాయక్వాడ్, రాజ్‌కుమార్ ధాబడే, రైతు నేత విశ్వంభర్ గోర్వే, పాత్రికేయులు సోమనాథ్ నాగురే తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sharannavaratri | ఇంద్రకీలాద్రికి శరన్నవరాత్రి శోభ.. తొలిరోజు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
- ●Revanth Reddy | గోయ్ రాఖోన్న్ యాత్ర.. గోవా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
- ●Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ - క్రైమ్ కామెడీగా 'తులాభారం'
- ●Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు
- ●Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..
- ●Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే

Sharannavaratri | ఇంద్రకీలాద్రికి శరన్నవరాత్రి శోభ.. తొలిరోజు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

Revanth Reddy | గోయ్ రాఖోన్న్ యాత్ర.. గోవా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి

Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ - క్రైమ్ కామెడీగా 'తులాభారం'

Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు



