Licensed surveyors | జీతాలివ్వడం లేదు.. కేటీఆర్ వద్ద లైసెన్స్‌డ్ సర్వేయర్ల ఆవేదన
Licensed surveyors | రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్లు తమకు జీతాలివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సర్వేయర్లు కేటీఆర్‌కు విన్నవించారు.
Licensed surveyors | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్లు తమకు జీతాలివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సర్వేయర్లు కేటీఆర్‌కు విన్నవించారు. తమ సమస్యలను పరిష్కరించే విధంగా కాంగ్రెస్ సర్కార్‌పై ఒత్తిడి తేవాలని కేటీఆర్‌ను వారు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం 5 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించింది. కానీ తమకు ఇటు పని కల్పించకుండా, అటు జీతాలివ్వకుండా రేవంత్ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల లైసెన్స్‌డ్ సర్వేయర్లకు జీతాలు ఇస్తుందని.. తెలంగాణలో మాత్రం తమకు వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు.
ఎమ్మార్వో ఆఫీసుకు పిలిచి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోబెడుతున్నారని.. జీతాలు మాత్రం ఇవ్వడం లేదని లైసెన్స్‌డ్ సర్వేయర్లు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



