త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MANUU | రేవంత్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా.. ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

MANUU | రేవంత్ రెడ్డి స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా ఉర్దూ యూనివ‌ర్సిటీలో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. రేవంత్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను లాక్కోవడాన్ని నిరసిస్తూ యూనివ‌ర్సిటీలోని సెంట్ర‌ల్ లైబ్ర‌రీ వ‌ద్ద విద్యార్థులు నిర‌స‌న‌కు దిగారు.

S

Hyderabad | Published On Jan 7, 2026, 6.48 pm IST

MANUU | రేవంత్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా.. ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
Advertisement

MANUU | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డి స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా ఉర్దూ యూనివ‌ర్సిటీలో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. రేవంత్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను లాక్కోవడాన్ని నిరసిస్తూ యూనివ‌ర్సిటీలోని సెంట్ర‌ల్ లైబ్ర‌రీ వ‌ద్ద విద్యార్థులు నిర‌స‌న‌కు దిగారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఖ‌రికి నిర‌స‌న‌గా విద్యార్థులు నినాదాలు చేశారు. యూనివర్సిటీ ప్రభుత్వ జాగీరు కాదని.. యూనివర్సిటీ భూమిపై కన్నేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చ‌రించారు. సెంట్రల్ లైబ్రరీ నుంచి వ‌ర్సిటీ మెయిన్ గేట్ వ‌ర‌కు ర్యాలీగా విద్యార్థులు బ‌య‌ల్దేరారు.

హైదరాబాద్ మౌలానా ఉర్దూ యూనివర్సిటీ భూముల స్వాధీనానికి జిల్లా కలెక్టర్ షోకాజు నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. యూనివ‌ర్సిటీకి సంబంధించిన‌ 50 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో కలెక్టర్ పేర్కొన్నారు. క‌లెక్ట‌ర్ షోకాజ్ నోటీసుల‌పై ఆయా పార్టీల నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

https://x.com/i/status/2008873311837790574

Advertisement

తాజావార్తలు

Advertisement