త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిర‌మ్మ కుట్టుమిష‌న్‌’ పథకం.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ..

Kuttu Machine Scheme | పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషిన్ పథకం’ను ప్రారంభించింది. వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కుట్టుపని ద్వారా ఆదాయం పొందేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలకు ఈ పథకం ద్వారా కుట్టు యంత్రాలను అందించనున్నారు.

P

Telangana | Published On Aug 25, 2026, 4.34 pm IST

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిర‌మ్మ కుట్టుమిష‌న్‌’ పథకం.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ..
Advertisement
  • స్వయం ఉపాధికి రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం
  • 18–55 ఏళ్ల మహిళలకు అవకాశం
  • సెప్టెంబరు 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌

Kuttu Machine Scheme | పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషిన్ పథకం’ను ప్రారంభించింది. వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కుట్టుపని ద్వారా ఆదాయం పొందేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలకు ఈ పథకం ద్వారా కుట్టు యంత్రాలను అందించనున్నారు.

వ‌య‌సు.. ఆదాయ ప‌రిమితి..

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పథకానికి దరఖాస్తు చేసుకునే వారి వార్షిక ఆదాయానికి ప్రభుత్వం పరిమితి విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదు. నిర్దేశిత ఆదాయ పరిమితిలో ఉన్న అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

అర్హులైన మహిళలు TGOBMMS పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు 2026 సెప్టెంబరు 15 వరకు గడువు ఉంది. గడువు ముగిసేలోపు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై సందేహాల నివృత్తి కోసం సంబంధిత జిల్లా బీసీ సంక్షేమ అధికారి కార్యాలయం, బీసీ కార్పొరేషన్‌ను సంప్రదించాలని సూచించారు. కుట్టు యంత్రం ద్వారా మహిళలు ఇంటి నుంచే ఉపాధి పొందేందుకు ఈ పథకం దోహదపడుతుందని ప్ర‌భుత్వం పేర్కొంది.

Advertisement
Advertisement