KTR | యువత ‘చేంజ్ మేకర్స్’గా ఎదగాలి.. స్ట్రీట్ కాజ్‌లో కేటీఆర్
KTR | ప్రముఖ విద్యార్థి స్వచ్ఛంద సంస్థ ‘స్ట్రీట్ కాజ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ట్ కాజ్ x కేటీఆర్: షేపింగ్ ది నెక్స్ట్ జనరేషన్ లీడర్స్’ నాయకత్వ సదస్సు ముగిసింది. నగరంలోని 50పైగా కళాశాలల నుంచి 300మందికిపైగా జెన్ జీ వలంటీర్లు, కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకత్వ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లో స్థాపించబడిన స్ట్రీట్ కాజ్, విద్యార్థుల నేతృత్వంలో సామాజిక మార్పు దిశగా విశేష కృషి చేస్తోంది. ఇప్పటివరకు రూ.6 కోట్లకుపైగా వ్యయంతో 15 వేలకుపైగా ప్రాజెక్టులను పూర్తి చేసి, 13 లక్షల మందికిపైగా ప్రజలకు, వెయ్యి జంతువులకు సహాయం అందించింది. ప్రస్తుతం 4వేలమంది క్రియాశీల వలంటీర్లు, 45,000 మందికిపైగా పూర్వ సభ్యులతో ఈ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్వకుంట్ల తారక రామారావుతో జరిగిన ముఖాముఖి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నాయకత్వం, పాలన, వ్యవస్థాపకత, దేశ నిర్మాణంలో యువత పాత్రపై మాట్లాడారు. తన బాల్యానుభవాలు, నాయకత్వ దృక్పథాన్ని ప్రభావితం చేసిన అంశాలను విద్యార్థులతో పంచుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధి ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, యువత ‘చేంజ్ మేకర్స్’గా ఎదిగి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై కూడా చర్చ జరిగింది. కొత్త పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కేటీఆర్ సూచించారు. ‘మిత్ వర్సెస్ ఫ్యాక్ట్’ సెషన్‌లో రాజకీయ నాయకులపై ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ, విద్యార్థుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇచ్చారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘మాక్ షార్క్ ట్యాంక్’లో విద్యార్థులు సమర్పించిన ఆలోచనలను కేటీఆర్ పరిశీలించి మార్గదర్శకత్వం అందించారు. ఒక వలంటీర్ కేటీఆర్ నాయకత్వ ప్రయాణంపై చేసిన ర్యాప్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్ట్రీట్ కాజ్ 17 ఏళ్ల ప్రస్థానానికి మద్దతుగా కేటీఆర్ రూ.17 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే, సంస్థకు సలహాదారుగా వ్యవహరించేందుకు అంగీకరించారు. ఇదే వేదికపై విరాళాల సేకరణ కోసం రూపొందించిన ‘donate.streetcause’ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. సామాజిక సేవలో విశేష కృషి చేసిన వలంటీర్లకు సన్మానాలతో కార్యక్రమం ముగిసింది. యువతను సాధికారత దిశగా నడిపిస్తూ, బాధ్యతాయుత నాయకులుగా తీర్చిదిద్దాలన్న స్ట్రీట్ కాజ్ లక్ష్యాన్ని ఈ సదస్సు ప్రతిబింబించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



