త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మీరే జడ్జి, మీరే జ్యూరీనా మిస్టర్ కమిషనర్? : సజ్జనార్‌పై కేటీఆర్ ట్వీట్

కోర్టులో నిజానిజాలు తేలాల్సిన ఓ ఆరోపిత నేరం మీద దర్యాప్తు చేస్తున్న టీమ్‌కి మీరు చీఫ్‌గా ఉన్నారు అనే విషయాన్ని మరిచిపోవద్దు. ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని గౌరవ న్యాయస్థానాలు గమనిస్తున్నాయని భావిస్తున్నా.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

J

Telangana | Published On Feb 2, 2026, 6.04 pm IST

KTR | మీరే జడ్జి, మీరే జ్యూరీనా మిస్టర్ కమిషనర్? : సజ్జనార్‌పై కేటీఆర్ ట్వీట్
Advertisement
  • హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై కేటీఆర్ ధ్వజం

KTR | త్రినేత్ర.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిట్ విచారణ అనంతరం హైదరాబాద్ సీపీ, సిట్ చీఫ్ వీసీ సజ్జనార్ చేసిన ట్వీట్‌పై బీఆర్ఎస్ ముఖ్య నేతలు భగ్గుమన్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ సజ్జనార్ ట్వీట్‌పై స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరే జడ్జి, మీరే జ్యూరీ అని డిసైడ్ అయినట్లున్నారు మిస్టర్ కమిషనర్.. అంటూ సజ్జనార్ ట్వీట్‌కి కేటీఆర్ రిప్లయి ఇచ్చారు. కోర్టులో నిజానిజాలు తేలాల్సిన ఓ ఆరోపిత నేరం మీద దర్యాప్తు చేస్తున్న టీమ్‌కి మీరు చీఫ్‌గా ఉన్నారు అనే విషయాన్ని మరిచిపోవద్దు. ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని గౌరవ న్యాయస్థానాలు గమనిస్తున్నాయని భావిస్తున్నా.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

https://x.com/KTRBRS/status/2018231389527896407

 

 

Advertisement
Advertisement