త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Cylinder Booking Rules | గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. బుకింగ్ రూల్స్ మార్చిన కేంద్రం

వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

J

National | Published On Sep 7, 2026, 6.02 pm IST

LPG Cylinder Booking Rules | గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. బుకింగ్ రూల్స్ మార్చిన కేంద్రం
Advertisement
  • గ్రామీణ ప్రాంతాల గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ కేంద్ర చమురు, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
  • గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ (LPG Refill Booking) గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు కుదింపు
  • ఇకపై పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రతి 25 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం
  • ఈ ఏడాది ఫిబ్రవరిలో గల్ఫ్ దేశాల ఘర్షణల నేపథ్యంలో విధించిన తాత్కాలిక ఆంక్షలను ఎత్తివేసిన కేంద్రం

LPG Cylinder Booking Rules | త్రినేత్ర.న్యూస్ : వంట గ్యాస్ (LPG) వినియోగదారులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ సోమవారం నాడు (సెప్టెంబర్ 7) కేంద్ర చమురు, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

గ్రామీణులకు 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గింపు

తాజా ఉత్తర్వుల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ (Refill Booking) కాలాన్ని 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించారు. అంటే, ఇకపై పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న గృహ అవసరాల గ్యాస్ వినియోగదారులంతా (Domestic LPG Consumers) ప్రతి 25 రోజులకు ఒకసారి తమ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలను తక్షణమే అమలు చేయాలని ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.

ఎందుకీ ఆంక్షలు విధించారంటే?

ఈ ఏడాది ఫిబ్రవరిలో మిడిల్ ఈస్ట్ (Middle East) దేశాల్లో తలెత్తిన ఘర్షణలు, ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో దేశీయంగా డిమాండ్‌ను కంట్రోల్ చేసేందుకు కేంద్రం మార్చి నెలలో తాత్కాలికంగా (Temporary) కొన్ని ఆంక్షలు విధించింది. అప్పట్లో సిలిండర్ బుకింగ్ గ్యాప్‌ను పట్టణాల్లో 25 రోజులుగా, గ్రామాల్లో 45 రోజులుగా నిర్ణయించింది.

సాధారణ స్థితికి గ్యాస్ సప్లై

ప్రస్తుతం దేశంలో గ్యాస్ సప్లై (Gas supply) సాధారణ స్థితికి చేరుకుంది. దీనికి తోడు పాత బ్యాక్‌లాగ్స్ (Backlogs) అన్నీ గణనీయంగా తగ్గడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. బుకింగ్ గడువును కుదించడంతో గ్రామీణ వినియోగదారులకు సిలిండర్ కోసం నెలల తరబడి ఎదురుచూసే కష్టాలు తప్పనున్నాయి.

LPG Cylinder Booking Rules Changed: Huge Relief for Rural Consumers

Advertisement
Advertisement